close
Choose your channels

Raja Singh:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు.. రాజాసింగ్ ఆగ్రహం..

Saturday, May 4, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు.. రాజాసింగ్ ఆగ్రహం..

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. నేతల విమర్శలు, ప్రతివిమర్శలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లుతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో కీలక నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై సైతం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ 48 గంటల ప్రచార నిషేధం విధించింది ఈసీ. తాజాగా ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపైనే ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీస్ కేసు నమోదుచేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.

మే 1వ తేదీన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా పాతబస్తీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. అయితే ప్రచారంలో భాగంగా మాధవీలత మాట్లాడే సమయంలో కొంతమంది చిన్నారులను అమిత్ షా తన వద్దకు రమ్మన్నారు. దీంతో వారు షా వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఓ చిన్నారి చేతిలోని బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో 'ఆప్ కీ బార్ 400 సీట్స్' అంటూ రాసి ఉందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు.. రాజాసింగ్ ఆగ్రహం..

ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా చిన్నారులతో ప్రచారం చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం దీనిపై విచారణ జరిపించాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. దీంతో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో విచారణ చేసిన మొఘల్‌పురా పోలీసులు.. క్రైం నెంబర్ 77/2024 సెక్షన్ 188 ఐపీసీ కింద అమిత్ షాపై కేసు నమోదు చేశారు.

ఇందులో ఏ1గా యమాన్ సింగ్, ఏ2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, ఏ3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏ4గా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఏ5గా MLA రాజాసింగ్‌ పేర్లను చేర్చారు. అయితే తమపై పోలీసులు కేసు నమోదు చేయడంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రచారంలో మద్యం పంపిణీ చేస్తోన్న కాంగ్రెస్ నేతలపై ఇప్పటివరకూ ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.