నానితో పోటీప‌డుతున్న ఆది

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవ‌ల ఆడియో రిలీజ్ చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...ఆది హీరోగా న‌టించిన తాజా చిత్రం గ‌రం. ఈ సినిమాలో ఆది స‌ర‌స‌న ఆదాశ‌ర్మ న‌టించింది. ఈ చిత్రాన్ని మ‌ద‌న్ తెర‌కెక్కించారు. సాయికుమార్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డం విశేషం. ఈ సినిమాని కూడా ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి..ఫిబ్ర‌వ‌రి 12న కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌, గ‌రం చిత్రాలతో పోటీప‌డుతున్న నాని, ఆది...ఇద్ద‌రూ విజ‌యం సాధిస్తారా..? లేక ఒక్క‌రే విజ‌యం సాధిస్తారో చూడాలి.

More News

మా మ‌ధ్య అలాంటిదేమీ లేదంటున్న హ‌న్సిక‌

దేశముదురు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఆత‌ర్వాత కంత్రి, మ‌స్కా, దేనికైనా రెడీ..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. చంద్ర‌క‌ళ సినిమాతో భ‌య‌పెట్టిన హ‌న్సిక క‌ళావ‌తి సినిమాతో మ‌రోసారి భ‌య‌పెట్ట‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో

హాంగ్ కాంగ్ వెళుతున్న యంగ్ హీరో..ఎవ‌రో కాదు ఎన‌ర్జిటిక్ హీరో రామ్. ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1న రిలీజైన నేను..శైల‌జ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి విజ‌యాన్ని సాధించింది.

సూప‌ర్ క‌లెక్షన్స్ తో దూసుకెళుతున్న‌ సోగ్గాడు

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతి కానుక‌గా 450 ధియేట‌ర్స్ లో రిలీజ్ అయ్యింది.

కిల్లింగ్ వీర‌ప్ప‌న్ సినిమాను రీమేక్ చేస్తానంటున్నస‌చిన్‌

మౌన‌మేల‌నోయి, నీ జ‌త‌గా నేనుండాలి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచితుడైన స‌చిన్ జోషి త్వ‌ర‌లోనే నిర్మాత‌గా మారి బాలీవుడ్లో సినిమాను నిర్మంచబోతున్నాడ‌ట‌.

న‌యన‌తార రెండోసారి...

వెంక‌టేష్‌, న‌య‌న‌తార ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి చేస్తున్న సినిమా బాబూ..బంగారం. లక్ష్మీ, తుల‌సి చిత్రాల్లో వెంక‌టేష్‌తో జోడి క‌ట్టిన న‌య‌న‌తార మూడోసారి మాత్రం న‌య‌న‌తార స‌ర‌స‌న న‌టించ‌డం లేద‌ట‌.