close
Choose your channels

తన ప్లానింగ్ తో అందరికి షాకిచ్చిన అక్షయ్ కుమార్

Monday, November 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తన ప్లానింగ్ తో అందరికి షాకిచ్చిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఇప్పుడు హిట్ మిష‌న్‌గా మారాడు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో పాటు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనూ న‌టిస్తూ అక్ష‌య్ దూసుకెళ్తున్నాడు. స్టార్ హీరోలంద‌రూ ఏడాదికి ఒక‌ట్రెండు సినిమాలు చేస్తుంటే అక్ష‌య్ కుమార్ మాత్రం ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఈయ‌న మ‌రో కొత్త సినిమాను త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌బోయే చిత్రం `బెల్‌బాట‌మ్‌`లో అక్ష‌య్ హీరోగా న‌టించ‌బోతున్నాడు.

`ల‌క్‌నౌ` ఫేమ్ రంజిత్ తివారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను జ‌న‌వ‌రి 22, 2021లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. ఇలా మూవీని అధికారికంగా ప్ర‌క‌టించిన రోజునే రిలీజ్ డేట్‌ను కూడా ప్ర‌క‌టించి త‌న ప్లానింగ్ గురించి అంద‌రికీ షాకిచ్చాడు అక్కి.

అక్ష‌య్ ఇక్క‌డ మ‌రో విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించాడు. అదేంటంటే.. అక్ష‌య్ సినిమాను అనౌన్స్ చేయ‌గానే ఇది ఓ క‌న్న‌డ చిత్రానికి రీమేక్ అనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై కూడా అక్ష‌య్ వెంట‌నే స్పందించారు. త‌న సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదు.. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన ఓరిజన‌ల్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్ చేతిలో ఐదారు సినిమాలున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.