close
Choose your channels

అల‌.. బ‌న్నీ డేట్ ఫిక్స్‌

Monday, September 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల‌.. బ‌న్నీ డేట్ ఫిక్స్‌

స్టైలిష్ స్టార్ తాజా చిత్రం `అల..వైకుంఠ‌పుర‌ములో..` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల అవుతుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం. ఈ మేర‌కు సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తార‌ని టాక్‌. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టైటిల్ ప్రొమో, పోస్ట‌ర్ అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను తీసుకువ‌చ్చాయి. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ట‌బు కీల‌క పాత్ర పోషిస్తుంది. జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ కోటీశ్వ‌రుడి బిడ్డ పేద‌వాడుగా, పేద‌వాడి కొడుకు కోటీశ్వ‌రుడిగా పెరుగుతారు. త‌ద‌నంత‌ర ప‌రిస్థితులు ఎలా మారుతాయ‌నేదే ఈ సినిమా క‌థాంశమ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న బ‌న్ని ఈ సినిమాను చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.