కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య

  • IndiaGlitz, [Sunday,November 08 2020]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.1.10 కోట్ల లంచం కేసులో తహసీల్దార్ నాగరాజుతో పాటు ధర్మారెడ్డి కూడా జైలుకు వెళ్లారు. ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై ధర్మారెడ్డి విడుదలయ్యారు. కుషాయిగూడలోని వాసవి శివనగర్‌ కాలనీలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ధర్మారెడ్డి ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాగా.. ఇటీవల జైల్లో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చంచల్‌గూడ్‌ జైలులో బలవన్మరణానికి పాల్పడ్డారు. జైలులోని మంజీరా బ్యారక్‌లో కిటికీకి తువ్వాలుతో ఉరి వేసుకున్నారు. రూ.1.10 కోట్లు నగదు లంచంగా తీసుకుంటూ ఆగస్టు 14న అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన నాగరాజు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని ఓ భూ వివాద పరిష్కారానికి నాగరాజు రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేయడం.. రూ.1.10 కోట్లు నగదు తీసుకుంటూ పట్టుబడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా.. మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో రియల్ ఎస్టేట్ బ్రోకర్ కందాడి ధర్మారెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర ఎమ్మార్వో నాగరాజుతో కలిసి భూ సెటిల్‌మెంట్లు, పట్టా పాస్‌బుక్‌లు ధర్మారెడ్డి చేయించినట్లు అధికారులు గుర్తించారు. 2011లో కుషాయిగూడ పీఎస్‌లో ధర్మారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ధర్మారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి నేడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

More News

డిసెంబ‌ర్‌లో ప‌వ‌న్‌తో శ్రుతి..!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బోనీక‌పూర్‌, దిల్‌రాజు నిర్మాత‌లు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌, ఇత‌ర

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో 'రాధేశ్యామ్‌'

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స్పీడుగా ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్‌గా ఇటలీలో కీల‌క షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియా చేరుందీ టీమ్‌. త‌దుప‌రి షెడ్యూల్‌కు

మెరిసిన కమల.. మురిసిన భారత్

అమెరికా చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం.. అమెరికా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు.. బైడన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు.. అమెరికాలో పాతుకుపోయిన జాతివివక్షను నిర్మూలిద్దాం...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ఘన విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయం సాధించారు. తుది ఫలితం పెన్సెల్వేనియాలో ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.

దుబ్బాక ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలివే

ఇటీవలి కాలంలో దుబ్బాక ఉపఎన్నిక రాజకీయంగా దుమ్ము రేపింది. ఈ మధ్యకాలంలో ఇంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక మరొకటి లేదనే చెప్పాలి.