చంద్రబాబుకు మరో షాక్.. కీలకనేత రాజీనామా!?

  • IndiaGlitz, [Wednesday,July 10 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గడ్డుకాలం వచ్చి పడింది. పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..? ఎవరు సైకిల్ దిగి వెళ్లిపోతారో అర్థం కాని పరిస్థితి..? ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ నేతలకు చైన్లేసి కట్టేసినా ఆగేలా పరిస్థితులు కనపడట్లేదు. రెండ్రోజులకోసారి ఒక్కోనేత ఇస్తున్న వరుస షాక్‌లతో అధినేత చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు, పార్టీని ఆర్థికంగా ఆదుకునేవారు అంతా పసుపు కండువా తీసేసి కాషాయం కండువా కప్పేసుకున్నారు. ఈ షాక్ నుంచి తేరుకోక మునుపే చంద్రబాబుకు మరో భారీ షాక్ తగిలింది.

అన్నం రాజీనామా.. పార్టీలో ప్రకంపనలు!

టీడీపీ కీలక నేత, గుంటూరులో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అన్నం సతీష్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. గత రెండ్రోజులుగా తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించిన అన్నం.. ఫైనల్‌గా పార్టీకి గుడ్ చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాజీనామా చేసిన తర్వాత అన్నం అటు వైసీపీలోకి వెళ్తారా..? లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఈయన రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలు అటు జిల్లాల్లోనూ.. ఇటు పార్టీలోని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఇంతకీ ఎవరూ అన్నం సతీష్!?

గుంటూరు జిల్లా టీడీపీలో అన్నం కీలక నేత ఉన్నారు. బాపట్ల టీడీపీలో అన్నం సతీష్ తిరుగులేని నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. ఆయన ఓడినప్పటికీ పార్టీకోసం పనిచేస్తున్న తీరును మెచ్చుకున్న నారా చంద్రబాబు.. ఎమ్మెల్సీగా నామినేట్ చేసి శాసన మండలికి పంపారు. 2019 ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. దీంతో అప్పట్లోనే టీడీపీకి టాటా చెబుతారని అందరూ భావించారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అన్నం అదే పని చేశారు.

అన్నం బీజేపీలో చేరే అవకాశం లేదని.. కచ్చితంగా రాజీనామా చేసి వైసీపీ తీర్థమే పుచ్చుకుంటారని తెలుస్తోంది. మరి అన్నం మనసులో ఏ ముందో వైసీపీ కండువా కప్పుకుంటారా..? లేకుంటే కాషాయ కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

హరీష్ కాళ్లు పట్టుకున్న మంత్రి.. నిజమా? అబద్దమా!?

అవును.. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి కట్టప్పలా ఉంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

‘ఉబెర్’ హెలికాఫ్టర్లు వచ్చేశాయ్.. 8 నిమిషాలకు కేవలం..!

ప్రముఖ కార్ల అగ్రిగేటర్ సంస్థ ‘ఉబెర్’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలో తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసి ‘ఉబెర్’ సత్తా ఏంటో చూపించింది.

షాకింగ్: రోజాకు మంత్రి పదవి దక్కకుండా చేసింది ఆ ఇద్దరేనా!?

అవును మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్‌ రోజాకు మంత్రి రాకపోవడం వెనుక ఆ ఇద్దరే కారణమని తెలుస్తోంది.

సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 7లక్షలు పరిహారం!

తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా రైతన్నల బతుకులు మాత్రం మారలేదని.. వారిని పట్టించుకునే నాధుడే లేడని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లలో చదివే ఉంటారు..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు  సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా 'నేనే కేడీ నెం-1' ట్రైల‌ర్ లాంచ్‌!!

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం  `నేనే కేడీ నెం-1’.