close
Choose your channels

‘ఉబెర్’ హెలికాఫ్టర్లు వచ్చేశాయ్.. 8 నిమిషాలకు కేవలం..!

Wednesday, July 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఉబెర్’ హెలికాఫ్టర్లు వచ్చేశాయ్.. 8 నిమిషాలకు కేవలం..!

ప్రముఖ కార్ల అగ్రిగేటర్ సంస్థ ‘ఉబెర్’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలో తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసి ‘ఉబెర్’ సత్తా ఏంటో చూపించింది. ఇప్పటి వరకూ రోడ్డు మార్గానికే పరిమితమైన ఉబెర్ తాజాగా.. ‘ఉబెర్ ఎయిర్’ పేరుతో హెలికాప్టర్ సర్వీసులతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతోంది. అంటే ఇకపై హెలికాఫ్టర్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని ఎంచక్కా ఎగిరిపోవచ్చన్న మాట.

మొదట ఎక్కడో..!

ఇప్పటివరకూ సొంత హెలికాప్టర్లలో లేదా ప్రైవేట్ హెలికాప్టర్లలో ఎక్కువ ఛార్జీలు చెల్లించి ప్రయాణించి విసిగిపోయిన వారికి ఇది ఒకింత శుభవార్తేనని చెప్పుకోవచ్చు. పైగా చార్జీలు కూడా తమ సర్వీసులలో తక్కువ ఛార్జీలకే వెళ్లవచ్చని ఉబెర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇంకా మన భారతదేశానికి ఈ సర్వీసులు రాలేదు. అమెరికా... న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచీ జాన్ ఎఫ్.కెనడి ఎయిర్‌పోర్ట్ వరకూ మొదట ఇక్కడ ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఈ సేవలు ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఎనిమిది నిమిషాలకు కేవలం..!

న్యూజెర్సీకి చెందిన ‘హెలీఫ్లైట్’ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నామని సదురు సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. రోజుకు 8 నుంచి 10 సర్వీసులను ప్రస్తుతం నడపాలని నిర్ణయం తీసుకున్నామనీ.. 8 నిమిషాల ప్రయాణానికి రూ.15,000 వరకూ వసూలు చేస్తున్నామని.. ఒక్కో హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంటే.. ప్రస్తుతం ప్రైవేట్ జెట్స్‌కి చెల్లిస్తున్న రెంట్ల కంటే ఇది చాలా తక్కువే అవుతుందని సదరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

భారత్‌కు ఈ సర్వీస్‌లు వస్తాయా..!?

ఈ సేవలను భారత్ సహా ఇతర దేశాలకు విస్తరించే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కంపెనీ ప్రతినిధులు అన్నారు. అయితే మున్ముంధు కూడా ఇండియాలో ప్రవేశపెడతారా లేదా అన్నది కూడా సందేహమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఉబెర్ హెలికాఫ్టర్లు ఏ మేరకు సక్సెస్ అవుతాయో..? ఇండియాకు వస్తాయో రావో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.