ప‌వ‌న్ 27 రేసులో మ‌రో టైటిల్‌..!

  • IndiaGlitz, [Monday,September 14 2020]

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తోన్న పీరియాడిక‌ల్ మూవీ ఒక‌టి సెట్స్‌పై ఉంది. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ చిత్రం..నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలంటే ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ అవ‌స‌రం. దీంతో ఎంటైర్ యూనిట్ ప‌వ‌న్ రాక‌కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ప‌వ‌న్ ఈ చిత్రంలో దొంగ‌గా న‌టించ‌బోతున్నారంటూ, ఆయ‌న‌ పాత్ర గురించి ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వినిప‌స్తున్నాయి. అలాగే ఈ సినిమాకు విరూపాక్ష‌, గజ‌దొంగ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

కాగా తాజా స‌మాచారం మేర‌కు ‘ఓం శివ‌మ్‌’ అనే మ‌రో టైటిల్ కూడా ఇప్పుడు ప‌రిశీల‌న‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, మ‌రో హీరోయిన్ ఈ సినిమాలో న‌టిస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ‘వకీల్‌సాబ్‌’ సినిమాను పూర్తి చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇది పూర్త‌యిన త‌ర్వాతే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసే సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతార‌ట‌. ఇది కాకుండా పవన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌లోనూ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమాలు చేయాల్సి ఉన్నాయి.

More News

అఖిల్ రెడీ అవుతున్నాడు..!

అక్కినేని అఖిల్ ఈ ఏడాది వేస‌విలో ‘మోస్ట్ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’తో సంద‌డి చేయాల‌నుకుటే క‌రోనా వైర‌స్ అడ్డం పడింది.

నవీన్ విజయ్ కృష్ణ, కీర్తి సురేష్ 'ఐనా ఇష్టంనువ్వు' చిత్రం

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రానికి ''ఐనా ఇష్టంనువ్వు''

ప్రియదర్శి ‘కంబాలపల్లి కథలు’.. షూటింగ్ ప్రారంభం

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజానీకం ఆన్‌లైన్‌కు బాగా అలవాటు పడిపోయింది.

బాల‌కృష్ణ‌106లో అల్ల‌రోడి సంద‌డి ఉంటుందా?

మ‌హేశ్ ‘మహర్షి’ చిత్రంలో రవి పాత్రలో నటించి మెప్పించిన అల్లరి నరేశ్..

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ ఎంపీకి షాక్..

పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎంపీలంతా ఢిల్లీ చేరుకున్నారు.