close
Choose your channels

అఖిల్ రెడీ అవుతున్నాడు..!

Monday, September 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఖిల్ రెడీ అవుతున్నాడు..!

అక్కినేని అఖిల్ ఈ ఏడాది వేస‌విలో ‘మోస్ట్ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’తో సంద‌డి చేయాల‌నుకుటే క‌రోనా వైర‌స్ అడ్డం పడింది. దీంతో దాదాపు ఐదారు నెల‌లు సినిమా షూటింగ్ ఆగింది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్ప‌టికే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున‌, నాగ‌చైత‌న్య సినిమాల షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో అఖిల్ అక్కినేని కూడా ‘మోస్ట్ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ షూటింగ్‌ను మంగ‌ళ‌వారం నుండి ప్రారంభిస్తున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీవాస్‌, వాసు వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోన్న పూజా హెగ్డేపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే పూజా హెగ్డే హైద‌రాబాద్ చేరుకుంది. అఖిల్ అక్కినేని మాత్రం ఈ నెల 20 నుండి సెట్స్‌లో జాయిన్ అవుతాడ‌ట‌. మ‌రో 15-20 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలింద‌ని టాక్‌. ఈ చిత్రీక‌ర‌ణ పూర్త‌యితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వరి 6న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి ఓ పాట‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.