ఉద్యోగాల కల్పనలో ఏపీ సర్కారు సరికొత్త రికార్డు: సీఎం
Send us your feedback to audioarticles@vaarta.com
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో చరిత్ర సృష్టించామని... ఇందుకు గర్వంగా ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తొలి నుంచి పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్న జగన్.... నాలుగు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. విజయవాడలోని ఏ- కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు.
72 గంటల్లో ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా నియామకాలు చేపట్టామని... గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సమన్వయంగా పనిచేయాలనీ సూచించారు. ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని... లంచం తీసుకోకుండా నిజాయితీగా పని చేయాలన్నారు. మీ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తారని నమ్ముతున్నాను అని అన్నారు జగన్. ఉద్యోగాలు కల్పిస్తుంది వివక్ష లేకుండా పని చేసి... నిరుపేదల మొహాల్లో నవ్వులు పూయించాలనే అన్నారు ముఖ్యమంత్రి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.