జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో..

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

ఇరుదుసుట్రు చిత్రంలో బాక్స‌ర్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న రితికా సింగ్‌.. నిజ జీవితంలోనూ బాక్స‌ర్. ఇదే చిత్రాన్ని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తే అందులో కూడా రితికా సింగ్ నటించింది. త‌ర్వాత ఈమె కొన్ని సినిమాల్లో న‌టించినా తొలి నాళ్ల‌లో న‌టించిన చిత్రాల‌కు వ‌చ్చినంత పేరైతే రాలేదు. ఇప్పుడు త‌న నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే మ‌రో పాత్ర‌లో న‌టించ‌డానికి రితికా సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే... బ్రూస్ లీలో విల‌న్‌గా న‌టించిన అరుణ్ విజ‌య్ ఇప్పుడు సాహోలో కీల‌క పాత్ర‌ధారిగా క‌నిపించ‌బోతున్నారు. ఈ యువ న‌టుడు త‌మిళంలో వివేక్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాక్స‌ర్ కావాల‌ని ఆశ‌ప‌డి జ‌ర్న‌లిస్ట్‌గా మారిన ఓ అమ్మాయి పాత్ర‌లో రితికా న‌టించ‌నున్నారు. బాక్సింగ్ గురించి తెలిసిన అమ్మాయి అయితే బావుంటుంద‌ని యూనిట్ ఆలోచించి ఆ పాత్ర‌కు రితికాసింగ్ అయితే స‌రిపోతుంద‌ని భావించి ఎంపిక చేసింద‌ట‌.

More News

పోలీస్ పాత్ర‌లో పాయ‌ల్‌..

తొలి చిత్రం `ఆర్‌.ఎక్స్ 100`లో లిప్ లాక్స్‌తో పాటు నెగిటివ్ ట‌చ్ ఉన్న లేడీ విల‌న్‌గా న‌టించి న‌టిగా ఆక‌ట్టుకుంది పాయల్ రాజ్‌పుత్‌.

హరీశ్‌‌రావు కీలక నిర్ణయం.. మార్చి15న రాజీనామా..!?

తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మార్చి 15న రాజీనామా చేయనున్నారా..?

'యాత్ర' మూవీ విషయంలో వైసీపీ ఫ్యాన్స్ ఓవరాక్షన్!

ఇదేంటి.. సినిమా చూసినోళ్లు ప్రోత్సహిస్తారు.. కిరాక్ అని చెబుతారు.. సూపర్ డూపర్ హిట్ అని చెబుతారు..

ఏపీ బాగుండాలంటే ‘సైకిల్‌‌’ను తొక్కాలి.. మర్చిపోరుగా!

గత కొన్ని రోజులుగా  ‘మై చానెల్ నా ఇష్టం’ అనే యూట్యూబ్ చానెల్ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే నా కుటుంబం - సౌంద‌ర్య

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ త‌న కుమార్తె సౌంద‌ర్య వివాహం న‌టుడు, ఫార్మా కంపెనీ య‌జ‌మాని విశాగ‌న్‌తో గ్రాండ్‌గా జరిగింది.