జర్నలిస్ట్ పాత్రలో..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇరుదుసుట్రు చిత్రంలో బాక్సర్ పాత్రలో నటించి ఆకట్టుకున్న రితికా సింగ్.. నిజ జీవితంలోనూ బాక్సర్. ఇదే చిత్రాన్ని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తే అందులో కూడా రితికా సింగ్ నటించింది. తర్వాత ఈమె కొన్ని సినిమాల్లో నటించినా తొలి నాళ్లలో నటించిన చిత్రాలకు వచ్చినంత పేరైతే రాలేదు. ఇప్పుడు తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే మరో పాత్రలో నటించడానికి రితికా సిద్ధమవుతున్నారని సమాచారం.
వివరాల్లోకెళ్తే... బ్రూస్ లీలో విలన్‌గా నటించిన అరుణ్ విజయ్ ఇప్పుడు సాహోలో కీలక పాత్రధారిగా కనిపించబోతున్నారు. ఈ యువ నటుడు తమిళంలో వివేక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాక్సర్ కావాలని ఆశపడి జర్నలిస్ట్‌గా మారిన ఓ అమ్మాయి పాత్రలో రితికా నటించనున్నారు. బాక్సింగ్ గురించి తెలిసిన అమ్మాయి అయితే బావుంటుందని యూనిట్ ఆలోచించి ఆ పాత్రకు రితికాసింగ్ అయితే సరిపోతుందని భావించి ఎంపిక చేసిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.