close
Choose your channels

ఏపీ బాగుండాలంటే ‘సైకిల్‌‌’ను తొక్కాలి.. మర్చిపోరుగా!

Monday, February 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ బాగుండాలంటే ‘సైకిల్‌‌’ను తొక్కాలి.. మర్చిపోరుగా!

గత కొన్ని రోజులుగా ‘మై చానెల్ నా ఇష్టం’ అనే యూట్యూబ్ చానెల్ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్న ఆయన తాజాగా మరింత డోస్ పెంచారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలను ఓ రేంజ్‌‌లో ఆడుకున్న ఆయన ఆరోగ్యంగా ఉండాలంటే ఏపీలో ‘సైకిల్’‌‌ను తొక్కాలంటూ ఓ చిన్న వీడియో చేసి పరోక్షంగా టీడీపీకి చురకలంటించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? వీడియో ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు..? నెటిజన్ల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తోంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం!

వీడియోలో ఏముందంటే...
సుమారు ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ వీడియోలో ఓ ఇద్దరు చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతూ ఉంటారు. వారిలో ఒకడు సైకిలెక్కి తొక్కుతుండగా.. ఇంకొకడు సైకిల్‌‌ను కిందపడేసి కోపంగా కాలితో తిరిగి తిరిగి తొక్కుతుంటాడు. ఇంతలో మొదటోడు సైకిల్ బెల్ కొట్టుకుడుతూ అటుగా వస్తాడు. ఈ మధ్యలో నాగబాబు ఎంటరవుతారు.

మొదటి పిల్లాడు..:
బాబూ ఏం చేస్తున్నావ్..(సైకిల్ ఎక్కి తొక్కుతున్న పిల్లాడు) అని నాగబాబు అడగ్గా.. "సైకిల్ తొక్కితో ఆరోగ్యానికి మంచిది అని తొక్కకుతున్నాను అంకుల్" అని సమాధానమిస్తాడు.

రెండో పిల్లాడు..:
హేయ్ బాబూ నువ్వేం చేస్తున్నావ్ అని రెండో పిల్లాడ్ని నాగబాబు అడగ్గా.."సైకిల్‌‌ను తొక్కితే ఆంధ్రప్రదేశ్‌కు మంచిదని .. సైకిల్‌‌నే తొక్కుతున్నాను అంకుల్.." అని సమాధానమిస్తాడు.

సైకిల్‌‌నే తొక్కాలి... మర్చిపోరుగా..!
ఈ ఇద్దరి సంభాషణ అనంతరం మళ్లీ నాగబాబు ఎంటరై.. " చూశారుగా ఆరోగ్యం బాగుండాలంటే.. సైకిల్‌‌ను తొక్కాలి అలాగే ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ‘సైకిల్‌‌’నే తొక్కాలి. మర్చిపోరుగా..( నవ్వుతూ..) థ్యాంక్యూ" అని చెబుతారు. ఇందులో వాహనం ఏ వ్యక్తికీ సంబంధించి కాదు. ఒక సైకిల్‌‌ కంపెనీకి మేమిచ్చిన యాడ్ (ప్రకటన) థ్యాంక్యూ అని నాగబాబు తన వీడియోను ముగించారు.

నెటిజన్ల రియాక్షన్..!
కాగా.. నాగబాబు వీడియోపై పలువురు జనసేన, మెగాభిమానులు కామెంట్ల రూపంలో.. ‘అంతేగా.. అంతేగా’ అని ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు ఇవన్నీ అవసరమా..? సార్ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ ‘సైకిల్‌’‌పై వీడియో చేసిన నాగబాబు.. రేపొద్దున వైసీపీ గుర్తు అయిన ‘ఫ్యాన్’ గురించి.. ఆ తర్వాత బీజేపీ ‘కమలం’ కూడా చేస్తారు.. ఇలాంటి వీడియోలను ముఖ్యంగా నాగబాబు దయచేసి ప్రోత్సహించకండి అంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెబుతున్నారు. మీ పార్టీని, మీ తమ్ముడ్ని ప్రమోట్ చేసుకోండి అంతేకానీ ఇలా చేయకండి.. అసలు ఇలాంటి చెత్త ఐడియాస్ నాగబాబుకు ఎవరిస్తున్నారు..? మీ వీడియోస్ మరీ సిల్లీగా ఉన్నాయ్..? అంటూ టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.