close
Choose your channels

బాబు-మోదీ గొడవలపై షాకింగ్ నిజాలు చెప్పిన అవంతి

Thursday, February 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాబు-మోదీ గొడవలపై షాకింగ్ నిజాలు చెప్పిన అవంతి

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చలేదని ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు ధర్మపోరాట దీక్షలు చేయడం.. ఇటీవల పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా టీడీపీ దీక్షలు చేసింది. అయితే ఎన్డీఏ నుంచి విడిపోవడం వెనుక అసలు సిసలైన కారణాలు అవి కాదని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్న అవంతి శ్రీనివాస్ షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

షాకింగ్ నిజాలు బయటపెట్టిన అవంతి..

"ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ఏం జరిగింది అనే విషయాలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు మోదీ-చంద్రబాబుల మధ్య చెడింది ప్రత్యేక హోదా గురించి కాదు. దీనికి కారణం ఒక ఎమ్మెల్యే. సాక్ష్యాత్తు ఒక ఎమ్మెల్యే చేసిన అవినీతి ప్రధాని దృష్టికి వెళ్లింది. ఆ ఎమ్మెల్యే పేరు చెప్పడం పద్దతి కాదు నిదానంగా పేరు చెబుతాను. ఆ ఎమ్మెల్యే గురించి.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని విచారించగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆయన సంస్థలతో విచారించారు. అందుకే అప్పట్నుంచి కేంద్రాన్ని ఏమడిగినా వారు స్పందించట్లేదు. ఏపీకి ఏమిచ్చినా తినేస్తారు.. అవినీతి జరుగుతుందని అందుకే కేంద్రం నుంచి ఏమీ రాలేదు. మనకు కేంద్రం నుంచి ఏమీ రాకపోవడానికి ఏకైక కారణం అవినీతి.. విచ్చలవిడితనం.. బంధుప్రీతి.. కొంతమందికే న్యాయం చేయడం ఇవే. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే వైసీపీ-బీజేపీ కుమ్మక్కయ్యారని రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరుగుతోంది. టీఆర్ఎస్, అమెరికాతో కుమ్మక్కయ్యారని చెబుతారు. ఆయనకు నచ్చింది చేస్తే అందరూ మంచోళ్లే.. లేకపోతే ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తారు.. ఇది మంచి పద్దతికాదు. ఇప్పటికైనా ఆంధ్రా ప్రజలు కొన్ని నిజానిజాలు తెలుసుకోవాలి. ఇవాళ కొత్త కొత్త పథకాలు తెస్తున్నారు.. జనాలు అన్నీ మరిచిపోయి.. నమ్మేస్తారని ప్రజలు చాలా చైతన్యమయ్యారు.. మీ మాటలు నమ్మరు" అని చంద్రబాబు-బాబుల గొడవపై షాకింగ్ నిజాలు చెప్పారు.

వైఎస్‌లాగే జగన్‌‌కు అవకాశమివ్వండి!

"జగన్ వెంటే ఏపీ ప్రజలు ఉన్నారు. ఆయన గొప్ప వ్యక్తి.. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. వైఎస్ లాగే జగన్‌‌ను సీఎం చేయాలని ఏపీ ప్రజలు ఫిక్స్ అయ్యారు. జగన్ పెన్షన్ రెండు వేలంటే ఆయన అంటారు.. లేకుంటే మూడు వేలు చేస్తానంటారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారు. కాపుల చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆ నాడు వైఎస్సార్ అన్ని వర్గాల వారికి న్యాయం చేశారు.. జగన్ కూడా న్యాయంచేస్తారు. ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే చాలు.. వాళ్లు అవినీతిపరులు అని చెబుతుంటారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందని నేను చంద్రబాబు పార్టీలో చేరాను. కానీ రాష్ట్రానికి మేలు జరగలేదు.. ఆయన, ఆయన పార్టీ మంత్రులు, నేతలు మేలుపడ్డారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు.. కానీ మా చేతిలో పోలీసులు, మీడియా ఉంది గనుక బయటికి రావట్లేదు. ఇంత అరాచకపాలన జరుగుతోంది. రాబోయే రోజుల్లో మీరు చేసిన ప్రతీ పనికి ప్రజల దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాపులకు జగన్ న్యాయం చేస్తారు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాన్ని మార్చుకుందాం.. రాజశేఖర్ రెడ్డిగారి పరిపాలన రావాలంటే జగన్‌‌ను గెలిపించాలి. రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని అవంతి చెప్పకొచ్చారు.

తాను చంద్రబాబుతో ఒక్క పనికూడా చేయించుకోలేదన్నారు. తాను భీమిలీ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారినట్లు వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అంతేనని ఆయన కొట్టిపారేశారు. కాగా.. ‘ఓ ఎమ్మెల్యే అవినీతే.. చంద్రబాబు-మోదీల మధ్య గొడవ జరిగింది’ అని చెప్పిన అవంతి మాటలు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన ఆరోపణలతో జనాలంతా అసలు కథ ఇదా అని ఆలోచనలో పడ్డారు. అయితే ఈ వ్యవహారంపై చంద్రబాబు, టీడీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.