ఏపీ పాలిటిక్స్‌లో వేలుపెట్టిన బండి.. సంచలన కామెంట్స్

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ మంచి ఊపు మీద ఉంది. దీంతో కొండనైనా సరే ఢీ కొట్టేస్తామన్న ధీమాతో తెలుగు రాష్ట్రాల కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కూడా సత్తా చాటాలని అటు ఏపీ.. ఇటు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అంతేకాదు.. ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మరోవైపు కులాలు, మతాలు, దేవాలయాల గురించి సైతం మాట్లాడేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఏపీలోని పలు దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడం.. నిందితులెవరో పోలీసులు ఇప్పటికీ తేల్చలేకపోవడం అనేది జరుగుతూనే వస్తోంది. దీన్నే అస్త్రంగా మార్చుకున్న బీజేపీ ఏపీలో.. మరీ ముఖ్యంగా తిరుపతి ఉపఎన్నికల్లో సత్తా ఏంటో చూపించేందుకు గాను ‘హిందూ’ కార్డును వాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఏపీ పాలిటిక్స్‌లో వేలుపెట్టి.. జగన్ ప్రభుత్వం, వైసీపీ, తిరుపతి ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు.

ఏధి కావాలో తేల్చుకోండి..

ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని అని బండి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక గురించి మాట్లాడిన ఆయన.. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగని ఆయన.. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతం అవ్వబోతున్నాయని జోస్యం చెప్పారు. గత కొన్నిరోజులుగా హిందు దేవాలయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ రెండు కొండలు అంటోందని అయితే.. బీజేపీది ఏడు కొండల వాడా గోవిందా గోవిందా అనేది సిద్ధాంతం అని చెప్పుకొచ్చారు. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని.. వైసీపీ ప్రభుత్వం మూట ముల్లె సర్థుకునేలా తరిమి కొడతామని బండి సంజయ్ ఓవర్‌కాన్ఫిడెన్స్‌గా మాట్లాడారు.

అంటే అర్థమేంటో..!?

ఏపీ దేవాదాయశాఖను పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్న బండి..‌ హిందువుల కానుకలను ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల ఘటనలతో ఏపీ సీఎం జగన్ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్ర బీజేపీ పోరాటానికి సిద్ధమవుతామన్నారు. దైవ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాడు మూర్ఖుడని బండి చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులని.. ఇక్కడ కార్యకర్తలను తీసేసినట్లుగా బండి మాట్లాడారు. అంటే ఆయన మాటలను బట్టి చూస్తే.. తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు ఏం అర్థం అయ్యిందో మరి. మొత్తానికి చూస్తే.. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టిన బండి.. తెలంగాణలో పాచికలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడినట్లుగా అక్కడ ఏదో చేయాలన్న భగీరథ ప్రయత్నం.. ఆయన విమర్శలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయో తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల తర్వాత చూడాల్సిందే.

More News

డ్రగ్స్ కేసు : ముంబైలో దొరికిన తెలుగు హీరోయిన్ ఎవరంటే..!

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుంటోంది.

ఐయామ్‌ బ్యాక్‌..రకుల్‌ ఆన్‌ సెట్స్‌ సందడి

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

క్రేజీ రోల్‌లో దీపికా పదుకొనె..!

బాలీవుడ్‌ స్టార్స్‌కు పాత్ర నచ్చితే చాలు.. హీరోగానే నటించాలని చూడరు. ప్రతినాయకుడిగానైనా తెరపై సందడి చేయడానికి రెడీ అయిపోతుంటారు.

కోవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్ అనుమతి..

హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్‌కు ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) లైసెన్సింగ్ అనుమతిని మంజూరు చేసింది.

మాదకద్రవ్యాల కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్..

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుని ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయింది.