close
Choose your channels

మొదటి సింగిల్ కి ముస్తాబవుతున్న'బ్యూటిఫుల్'

Tuesday, October 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మొదటి సింగిల్ కి ముస్తాబవుతున్నబ్యూటిఫుల్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకుడు. లోగడ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న చిత్రమిది.

టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లోని మొదటి సింగిల్ (పాట)ను ఇదే నెల 20 నుంచి 25 లోపు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అలాగే ప్రీ రిలీజ్ వేడుకలలో భాగంగా ఈ నెలాఖరులో వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లలోని కాలేజీలకు చిత్రబృందం వెళ్లి సందడి చేయనున్నది. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఆకట్టుకోనున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.