close
Choose your channels

బిగ్‌బాస్ ఫేమ్ ప్రియ ఇంట్లో పెళ్లివేడుక.. కంటెస్టెంట్ల సందడి

Monday, November 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమాలు,  సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. దీంతోనే ప్రియకు బిగ్‌బాస్‌ షో తెలుగు 5వ సీజన్‌లో ఛాన్స్ దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడ ఇతర కంటెస్టెంట్ల ఆటను అంచనా వేస్తూ తనదైన స్ట్రాటజీతో గేమాడింది ప్రియ. కెప్టెన్ కాలేరని తెలిసినప్పటికీ.. నామినేషన్ల కత్తి వేలాడుతున్నా చిరునవ్వుతోనే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎందరో మనసులను కొల్లగొట్టారు. చివరకు అసాధ్యం అనుకున్న కెప్టెన్సీ సైతం అందుకుని ఔరా అనిపించింది.

ఒకానొక దశలో ఫైనల్స్‌కి వెళతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే సన్నీతో ప్రవర్తన, ప్రతి దానికి నోరు పారేసుకోవడం వంటి వాటితో నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో చివరికి ప్రియ ఎలిమినేట్ అయ్యారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ప్రియకు ఒక్క వారానికే 1.5  లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ కింద దక్కినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఆమె ఏడు వారాలకు పది లక్షల పైనే సంపాదించినట్లు లెక్క. ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో ప్రియకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఇంత మొత్తాన్ని ఫిక్స్‌ చేసినట్లు కనిపిస్తోంది.

కాగా.. చాలా రోజుల తర్వాత ప్రియ మళ్లీ వార్తల్లొకెక్కారు. ఆమెకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి ఆదివారం జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దానికి ముందే 'మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ' అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు పంచుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.