కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ కంటే బురదలో పందులు నయం: బీజేపీ ఎంపీ

దళారీలకు సీఎం కేసీఆర్ చీఫ్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టంపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్‌ను త్వరలో బట్టలూడదీసి కొడతారన్నారు. ఉద్యమం అంటే కేసీఆర్‌కు చూపిస్తామని.. గడాఫీకి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఫేక్ ఉద్యమం నడుపుతోందన్నారు. దుబ్బాక ఎన్నికతో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీజేపీదేనన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. ధర్నా చౌక్ ఎత్తేసినోళ్ళకి ధర్నాలు చేసే హక్కులేదని అరవింద్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో దిమ్మతిరిగింది కేటీఆర్‌కు సరిపోలేదేమోనని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాలన తీరు మారకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని హెచ్చరించారు. ఇంకా అరవింద్ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగం గురించి నాకంటే కేసీఆర్‌కు బాగా తెలుసు. బెంగాల్‌నే కొట్టబోతున్నాం.. తెలంగాణలో కేసీఆర్ మాకొక పెద్ద సమస్య కాదు. కేసీఆర్, కేటీఆర్, ఆర్థికమంత్రి హరీష్‌రావు కంటే బురదలో పందులు నయం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రక్తం తాగే బ్రోకర్. మక్కలు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రభుత్వం చెప్పాలి. సన్నాలను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదు? దగ్గు, జలుబు వస్తే కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రైన యశోదాకే ఎందుకు వెళ్తున్నాడు? కవిత, హరీష్‌రావులు కార్పోరేట్ కాళాశాలల్లోనే తమ పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు?

సాయంత్రమైతే కేటీఆర్ కార్పోరేట్ తరహా పార్టీలు ఎందుకు చేసుకుంటున్నాడు? కేటీఆర్, కవితలు కమిషన్ ఇవ్వకపోవటం వలనే ఎమ్మెల్యే, మంత్రులు భూనులు కబ్జాలు చేస్తున్నారు. కేసీఆర్ రైతు నిర్వచనాన్నే మార్చివేశారు. ‌‌‌దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని.‌‌‌‌. పాస్ పుస్తకం ఉన్నోడిదే భూమి అనే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడు. దళారీలు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీ ఉద్యమంలో రైతులు లేరు. తెలంగాణలో పండుతున్న పసుపును కాదని.‌. కమిషన్ కోసమే ప్రభుత్వం పసుపును దిగుమతి చేసుకుంటోంది. వేల కోట్ల కమీషన్లు పోతున్నాయనే రైతు చట్టంపై ప్రాంతీయ పార్టీల ఏడుపు’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.

More News

గుడ్ న్యూస్.. రూ.250 కే కరోనా టీకా..

కరోనా టీకా ఎప్పుడొస్తుందో అనే ప్రశ్న కంటే.. ఆ టీకా ధర ఎంత ఉంటుందోనన్న భయమే సామాన్య ప్రజానీకాన్ని పట్టి పీడిస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్..

నిహారిక వివాహం : రేర్ ఫోటోను షేర్ చేసిన చిరు..

మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల వివాహం మరికొన్ని గంటల్లో వైభవంగా జరగనుంది.

‘చేజింగ్’లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన వరలక్ష్మి శరత్‌కుమార్

వెరైటీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. లాక్‌డౌన్ తరువాత ఫుల్ బిజీగా మారిపోయింది.

రైతు కష్టాలు ఇవాళే కనిపించాయా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనం ఫైర్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేసినా తప్పే అవుతోంది. వరద బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు ఎక్కడికక్కడ ప్రజానీకం నిలదీసింది.

కేసీఆర్ ప్లాన్.. తెలంగాణలో వైసీపీ.. షర్మిలకు బాధ్యతలు!

రాష్ట్రంలో వరుసగా ఎదురవుతున్న పరాభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు.