close
Choose your channels

సీ-ఓటర్ సర్వే చెప్పిందంటే జరగదంతే.. పాపం తమ్ముళ్లు..

Friday, February 9, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీ-ఓటర్ సర్వే చెప్పిందంటే జరగదంతే.. పాపం తమ్ముళ్లు..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియా టుడే-సీ ఓటర్ కలిసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ సీట్లు వస్తాయని.. వైసీపీ 8 స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది. అంతే ఇక తెలుగు తమ్ముళ్లు తెగ రెచ్చిపోతున్నారు. తమ గెలుపును ఎవరూ ఆపలేరంటూ సంకలు గుద్దుకుంటున్నారు. వాస్తవంగా ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. అయితే మై యాక్సిస్‌ ఇండియాతో కలిసి చేసిన సర్వేలు మాత్రమే నిజమయ్యాయి.

సీ ఓటర్‌తో చేసిన సర్వేలన్ని రివర్స్ అయ్యాయి. దీంతో ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత ఎలాంటిదో గుర్తించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సర్వేను అయినా నమ్మాలంటే ఆ సంస్థ ట్రాక్ రికార్డు ఓసారి పరిగణనలోకి తీసుకోవాలి. కానీ పచ్చ బ్యాచ్ ఇవేమీ పట్టించుకోకుండా ఎగిరెగిరిపడుతున్నారు. వాస్తవంగా సీ-ఓటర్ ట్రాక్‌ రికార్డు చూస్తే దానికి అంత సీన్‌ లేదనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు వస్తాయని, 90 నుంచి 100 శాసనసభ స్థానాలు సాధిస్తుందని అభిప్రాయపడింది. చివరకు ఫలితాలు ఎలా వన్ సైడ్‌గా వచ్చాయో అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో వైసీపీ 22 లోక్‌సభ స్థానాల్లో, 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించగా.. టీడీపీ కేవలం 3 లోక్‌సభ స్థానాలు, 23 శాసనసభ స్థానాలకు పరిమితమైంది.

అలాగే ఇటీవల 2023లో జరిగిన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీ- ఓటర్‌ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 45 నుంచి 51 స్థానాలు వస్తాయని ప్రీపోల్‌ సర్వేలో తెలపగా.. 41 నుంచి 53 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడించింది. ఫలితాలు వచ్చాక కాంగ్రెస్‌కు 35 స్థానాలు, బీజేపీకి 54 స్థానాలు వచ్చాయి. అంటే ఆ సంస్థ చెప్పిన దానికి సీన్ రివర్స్ అయిందన్న మాట.

ఇక మధ్యప్రదేశ్‌లోనూ నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌కు 118 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలింది. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో 113 నుంచి 137 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని తేల్చింది. కానీ బీజేపీకి 163 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌ 66 స్థానాలకే పరిమితమైంది. అంటే ఈ సంస్థ చేసిన సర్వేలన్ని తారుమారయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.

ఆ సంస్థ విశ్వసనీయత ప్రకారం ఏపీలోని లోక్‌సభ స్థానాల విషయంలోనూ లెక్కలు తారుమారు కావడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా తెలుగు తమ్ముళ్లు మాత్రం తెగ సంబరిపడిపోతున్నారు. 2019లో కూడా 'సీ-ఓటర్' లాంటి ఫేక్ సర్వేలతో ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు తెలివైన వాళ్లు.. వారు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికే వేస్తారు. అంతే తప్ప ఇలాంటి ఫేక్ సర్వేలు చూసి కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.