close
Choose your channels

కేసీఆర్ సర్కారుపై కన్నెర్రజేసిన కాగ్...

Friday, March 26, 2021 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్ సర్కారుపై కన్నెర్రజేసిన కాగ్...

2019 సంవత్సరానికి గానూ ప్రభుత్వరంగ సంస్థలపై కాగ్ తన నివేదికను విడుదల చేసింది. కేసీఆర్ సర్కారుపై కన్నెర్రజేసిన కాగ్.. ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. విద్యుత్ రంగంలో డిస్కంల భారీ నష్టాలు.. పీయూసీల నష్టానికి కారణమైందని కాగ్ వెల్లడించింది. రాష్ట్ర స్థితిగతులను ఈ నివేదికలో కాగ్ స్పష్టంగా వివరించింది. సామాజిక, ఆర్థిక రంగాలు, రెవెన్యూ, విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక ఇచ్చింది. అలాగే విద్యుత్ రంగంలో పీయూసీల నష్టం రూ.28 వేల 426 కోట్లుగా తెలిపింది. 2018-19 బడ్జెట్‌లో తప్పుడు వర్గీకరణ తో రెవెన్యూ మిగులును చూపారని.. రూ.4337 కోట్ల రెవెన్యూ మిగులు అవాస్తవమని నివేదికలో పేర్కొంది. దేవాలయ భూముల్లో 23 శాతం ఆక్రమణల్లో ఉన్నాయని కాగ్ వెల్లడించింది. దేవాలయ భూముల పరిరక్షణ కోసం సరైన యంత్రాంగం లేదని పేర్కొంది.

కాగ్ నివేదిక పూర్తి వివరాలు...

2018 మధ్య విద్యుత్ సంస్థలకు వచ్చిన నష్టం రూ.13,533 కోట్లు

జెన్ కో 3518 కోట్లు, ట్రాన్స్ కో 532 కోట్ల లాభాలు

డిస్కమ్‌లు రూ.17,580 కోట్ల నష్టం

విద్యుత్ రంగంలో నికర నష్టం రూ.13,533 కోట్లు

విద్యుత్ సంస్థల దీర్ఘకాలిక రుణాలు రూ.36,732 కోట్లు

ఉదయ్ పథకంతో రూ.7,723 కోట్లు వచ్చాయి

తెలంగాణ సర్కార్ రూ.20,785 కోట్ల పెట్టుబడులు

2014-18 మధ్య విద్యుత్‌ సంస్థలకు రూ. 13,533 కోట్ల నష్టాలు

జెన్‌కో రూ.3.518 కోట్లు, ట్రాన్స్‌కో రూ.532 కోట్ల లాభాలు

రూ.17,580 కోట్ల నష్టాల్లో డిస్కమ్‌లు

మొబైల్‌ఫోన్‌ల అమ్మకంపై తక్కువ పన్ను వేయడంతో రూ. 43.89 కోట్ల నష్టం

2018-2019 మధ్య ఆర్టీసీ నష్టాలు రూ.928 కోట్లు.

ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కాగ్..

2018-19 బడ్జెట్‌లో తప్పుడు వర్గీకరణ తో రెవెన్యూ మిగులును చూపారు

రూ.4337 కోట్ల రెవెన్యూ మిగులు అవాస్తవం

రూ.5114 కోట్ల రెవెన్యూ లోటు ఉందని మా పరిశీలనలో తేలింది

వడ్డీల భారం అధికంగా ఉంది

సగటున 6.93 శాతం వడ్డింపులు చెల్లిస్తున్నారు

వడ్డీ చెల్లింపుల్లో 16 శాతం పెరుగుదల ఉంది

రెవెన్యూ రాబడితో పోలిస్తే 12.41 శాతంగా ఉన్న వడ్డీ చెల్లింపులు

14 ఆర్ధిక సంగం ప్రకారం 8.37 శాతం మించ రాదు

విద్య రంగం పై కేటాయిపులు తక్కువగా ఉన్నాయి

సాగునీటి ప్రాజెక్ట్స్ ఆలస్యం వల్ల 87 వేల కోట్ల మేర అంచనాలు పెరిగాయి

బడ్జెట్ కేటాయింపులు లేకుండానే...రూ.3507 కోట్లు ఖర్చు చేశారు

ఐదు ఆర్ధిక నియంత్రణ వ్యవస్థ ను అతిక్రమించడమే, ఆర్ధిక క్రమశిక్షణ రహిత్యమే

2014 నుంచి 2018 వరకు బడ్జెట్ కేటాయింపులు లేకుండానే రూ.55,517 కోట్లు ఖర్చు చేశారు

హైదరాబాద్‌లో ప్రతి వ్యక్తికి రోజుకు నీళ్లు 150 లీటర్ల ఇస్తున్నామఅన్నారు...కానీ 70 లీటర్ల కు మించి ఇవ్వడం లేదు

దేవాలయ భూముల్లో 23 శాతం ఆక్రమణల్లో ఉన్నాయి

దేవాలయ భూముల పరిరక్షణ కోసం సరైన యంత్రాంగం లేదు

20,124 ఎకరాల భూమి కబ్జా అయితే 3488 ఏకరాలపై మాత్రమే కేసులు.. ఇది కేవలం 17.33 శాతం భూమి

ఆడిట్ చేసిన 24 మండలాల్లో 1096 కోట్ల విలువగల 12,666 ఎకరాలు కబ్జా

విద్యారంగంపై తక్కువ కేటాయింపులు..

2014-2019 మధ్య క్యాపిటల్ ప్రాజెక్టుల కోసం లక్ష 1877 కోట్లు ఖర్చు

26 ప్రాజెక్టులకు గాను 20 ప్రాజెక్టులు...11 నెలలు ఆలస్యం

దీంతో వ్యయం..లక్ష 87 వేల 848 కోట్లు

అంచనా పెరిగింది

లక్ష 4 వేల 494 కోట్లు ఖర్చు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.