ప్రత్యేక హోదాపై తేల్చేసిన  కేంద్రం.. వాట్ నెక్స్ట్ జగన్!

  • IndiaGlitz, [Tuesday,June 25 2019]

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని.. అధికార వైసీపీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ అయ్యి హోదాపై చర్చించారు. మున్ముంథు మరిన్నిసార్లు మోదీతో భేటీ అయ్యి హోదా అడుగుతూనే ఉంటానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల్లో సైతం వైసీపీ ఎంపీలు.. హోదా కచ్చితంగా ఇవ్వాలని.. విభజన అనంతరం రాష్ట్రం కోలుకోవాలంటే హోదానే సంజీవని అని గళమెత్తుతున్నారు.

తేల్చేసిన కేంద్రం..!

అయితే సోమవారం నాడు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. హోదాపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ ఒక్క రాష్ట్రానికే కాదు.. ఇకపై ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రణాళికా మద్దతు కోసమే ప్రత్యేక హోదా ఇవ్వాలని జాతీయాభివృద్ది మండలి సిఫారసు చేసిందని.. పారిశ్రామిక రాయితీలతో సంబంధం లేదని ఈ సందర్భంగా నిర్మల తేల్చి చెప్పారు. కాగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు 7 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయని సభా ముఖంగా ఆమె వెల్లడించారు. లోకసభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు.. పై విధంగా నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

వాట్ నెక్స్ట్ జగన్..!

ఇదిలా ఉంటే ఏపీలో పరిస్థితేంటి..? ఏపీలో అధికారం దక్కించుకున్న వైసీపీ ప్లాన్ ఏంటి..? ఏపీ నుంచి పదే పదే డిమాండ్స్ వెళ్లడం.. ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రసక్తే లేదని ఇలా సమాధానాలు రావడం షరామామూలైపోయింది. అయితే ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More News

బీజేపీలో చేరిన అంబికా షాకింగ్ కామెంట్స్...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.

ప్రజా ఉద్యమాలతోనే ‘ప్రత్యేక హోదా’ సాధ్యం.. ప్రశ్నిస్తా!

ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక హోదాను సాధించగలమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'.

జగన్‌కూ టైమ్ ఇస్తాం.. ప్రజావేదికపై పవన్ రియాక్షన్

ప్రజావేదికను ఎల్లుండి కూల్చేస్తామని.. అక్రమ కట్టడాల కూల్చివేత ఇక్కడ్నుంచే ప్రారంభించబోతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన విషయం విదితమే.

సైరా షూటింగ్ పూర్తి

తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న హిస్టారిక‌ల్ చిత్రం `సైరా న‌రసింహారెడ్డి`.