పాటల రికార్డింగ్ లో 'చుట్టాలబ్బాయి'...

  • IndiaGlitz, [Wednesday,August 05 2015]

ఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై చుట్టాలబ్బాయి' చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నైలో పాటల రికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు వీరభద్రం చౌదరియే తెలియజేశారు. భాయ్' తర్వాత వీరభద్రం చౌదరి, రఫ్' మూవీ తర్వాత ఆది చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఇద్దరూ సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.

More News

నాగ్ సరసన కొత్త భామ...

కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ హీరోలుగా సూపర్హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి. పతాకంపై మున్నా, బృందావనం, ఎవడు వంటి సూపర్హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి

నైజాంలో 'సినిమా చూపిస్త మావ' అంటున్న దిల్‌రాజు!!

ప్రొడ్యూసర్‌గానే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్‌రాజు ‘పట్టిందల్లా బంగారమే’ అన్న విషయం అందరికీ తెలిసిందే.

14న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా..?

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం ‘మాలిని అండ్ కో’. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 14న సినిమా విడుదలవుతుంది.

'గుంటూరు టాకీస్' ఫస్ట్ లుక్ లాంచ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్ టాకీస్’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు,

'హోరా హోరీ' సెన్సార్ పూర్తి

'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్.