close
Choose your channels

నైజాంలో 'సినిమా చూపిస్త మావ' అంటున్న దిల్‌రాజు!!

Wednesday, August 5, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రొడ్యూసర్‌గానే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్‌రాజు పట్టిందల్లా బంగారమే` అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవకాలంలో గోల్డెన్‌ రాజు`గానూ వ్యవహరించబడుతున్న దిల్‌రాజు తాజాగా బాహుబలి` చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేయడం, ఆ చిత్రం తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రను తిరగరాయడం సైతం తెలిసిందే. అటువంటి దిల్‌రాజు బాహుబలి` అనంతరం సినిమా చూపిస్త మావ` చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాలు ఫ్యాన్సీ ఆఫర్లతో బిజినెస్‌ జరుపుకొని, అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న సినిమా చూపిస్త మావ` చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కు దిల్‌రాజు సొంతం కావడంతో ఈ సినిమాపై గల క్రేజ్‌ మరింత పెరుగుతోంది.

ఈ సందర్భంగా ...

దిల్‌రాజు మాట్లాడుతూ... బాహుబలి` వంటి మెగా బ్లాక్‌బస్టర్‌ తర్వాత నైజాంలో మేం డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న సినిమా సినిమా చూపిస్త మావ`. ఈ సినిమా గురించి గత కొన్ని వారాలుగా వింటూనే ఉన్నాను. దాంతో సినిమా చూపించమని నిర్మాతలను అడిగితే` సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్‌ నాకు సినిమా చూపించారు. వాళ్లూ వీళ్లూ చెప్పిన మాట ద్వారా` సినిమా చూపిస్త మావ` చిత్రంపై కొంత ఎక్స్‌పెక్టేషన్‌తో సినిమా చూసిన నేను.. సినిమా చూసి స్పెల్‌బౌండ్‌ అయిపోయాను. ఇటీవకాంలో ఓ చిన్న సినిమా ఇంత వండర్‌ఫుల్‌గా రావడం జరగలేదు. వెంటనే మా శిరీష్‌ను కూడా చూడమని చెప్పాను. తనకి కూడా విపరీతంగా నచ్చేసింది. సెకండ్‌ ధాట్‌ లేకుండా.. ప్రొడ్యూసర్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న మొత్తానికి.. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ తీసుకొన్నాను.

ఈ సందర్భంగా సినిమా చూపిస్త మావ` నిర్మాతతోపాటు డైరెక్టర్‌ త్రినాధరావు నక్కిన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌చంద్ర, డైలాగ్‌ రైటర్‌ ప్రసన్నకుమార్‌ తదితరును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ నటించిన ఉయ్యాల జంపాల` కంటే.. వాళ్లిద్దరూ రెండోసారి కలిసి నటించిన సినిమా చూపిస్త మావ` మరింత పెద్ద విజయం సాధించడం ఖాయం` అన్నారు.

అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌-ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)-రూపేష్‌ డి.గోహిల్‌-జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా చూపిస్త మావ` ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.