మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. న్యూయార్క్‌ గవర్నర్ కీలక నిర్ణయం

  • IndiaGlitz, [Thursday,November 12 2020]

కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా మరోమారు తిరిగి విజృంభిస్తోంది. అమెరికాలో కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇటీవల అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇది కూడా కరోనా విజృంభణకు ఒక కారణమైంది. కాగా.. అమెరికా దేశంలోని న్యూయార్కు రాష్ట్రంలో కరోనా సంక్రమణ రేటు 3 శాతానికి చేరుకుంది. దీంతో న్యూయార్క్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో రాత్రి 10 గంటలకు బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు మూసివేయాలని గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు.

అలాగే న్యూయార్క్‌లో కొవిడ్-19 మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా ఇన్ డోర్, అవుట్ డోర్ సమావేశాల్లో 10 మందికి పరిమితం చేయాలని ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 13వతేదీ నుంచి స్టేట్ లిక్కర్ అథారిటీ జారీ చేసిన లైసెన్సులున్న బార్‌లతో పాటు జిమ్‌లను రాత్రి 10 గంటలకల్లా మూసివేయాలని గవర్నరు ఆదేశించారు. రెస్టారెంట్లు, బార్‌లలో సైతం రాత్రి 10 గంటల తర్వాత మద్యం కాకుండా ఆహారం మాత్రం డెలివరీ చేసేందుకు అనుమతించినట్లు క్యూమో చెప్పారు.

More News

ప్రి వెడ్డింగ్ షూట్‌‌లో విషాదం.. వధూవరులిద్దరూ మృతి

ఐదేళ్ల ప్రేమకు పెద్దలు కూడా రైట్ కొట్టారు. దీంతో ఆ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఇరువైపుల పెద్దలూ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు.

ప్రభాస్‌ చిత్రంలో బెల్లంకొండ..!

ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చిత్రంలో యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్నాడా? ఏ సినిమాలో అని అనుకుంటున్నారా..

కాబోయే వ్యక్తిని పరిచయం చేసిన అవికాగోర్‌

హీరోయిన్‌ అవికాగోర్‌ త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నారు.

'నెపొటిజం' గురించి పూరి ఏమన్నారంటే...

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ పలు విషయాలపై 'పూరీ మ్యూజింగ్స్‌' పేరుతో స్పందిస్తున్నారు.

'ఉప్పెన' సాంగ్‌ లాంఛ్ చేసిన మహేశ్‌

మెగా క్యాంప్ హీరో సాయితేజ్ సోద‌రుడువైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం‘ఉప్పెన’.