close
Choose your channels

ప్రభాస్‌ చిత్రంలో బెల్లంకొండ..!

Wednesday, November 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్‌ చిత్రంలో బెల్లంకొండ..!

ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చిత్రంలో యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్నాడా? ఏ సినిమాలో అని అనుకుంటున్నారా.. సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ప్రభాస్‌ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్నాడు. అయితే టాలీవుడ్‌లో బాలీవుడ్‌లో.. వివరాల ప్రకారం ప్రభాస్‌, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రాల్లో ఛత్రపతి ఒకటి. ఈ సినిమా ఎంతటి సెన్సేషనల్‌ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారట.

ప్రభాస్‌ చిత్రంలో బెల్లంకొండ..!

ఈ రీమేక్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తుంది. బాలీవుడ్‌లో హీరోలు లేదా ఏం.. బెల్లంకొండతో నిర్మాతలు ఎందుకు సినిమా చేస్తారని అంటున్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే అయినా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్‌తో బాలీవుడ్‌లో ఛత్రపతి సినిమాను రీమేక్‌ చేయనుందట. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'అల్లుడు అదుర్స్‌' చిత్రంలో నటిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.