close
Choose your channels

కోలీవుడ్‌లో క్రికెట‌ర్స్‌

Tuesday, October 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోలీవుడ్‌లో క్రికెట‌ర్స్‌

ఇప్పుడు ఇండియ‌న్ క్రికెట‌ర్స్ అంద‌రూ కోలీవుడ్‌లో న‌టిస్తున్నారు. వీరు న‌టించ‌బోయే సినిమాల‌న్నీ అధికారికంగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాయి. `అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్‌(ఇమైక్కా నొడిగ‌ల్)` ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో చియాన్ విక్ర‌మ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. కోలీవుడ్ ఇప్ప‌టికే మ‌రో ఇద్ద‌రు క్రికెట‌ర్స్ న‌టిస్తుండ‌టం విశేషం. అందులో హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా ఉన్నారు. ఈయ‌న సంతానం హీరోగా త్రిపాత్రాభిన‌యం చేస్తున్న `డిక్కీలోనా` చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే క్రికెట్ నిషేధాన్ని ఎదుర్కొన్ని కోర్టు స‌పోర్ట్‌తో త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్న మ‌రో క్రికెట‌ర్ శ్రీశాంత్ కూడా కోలీవుడ్ న‌టిస్తున్నాడు. వివ‌రాల్లోకెళ్తే..హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో శ్రీశాంత్ న‌టిస్తున్నాడ‌ని చిత్ర యూనిట్ రీసెంట్‌గా ప్ర‌క‌టించింది.

ఇక్కడ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఈ ముగ్గురు క్రికెటర్స్ ఒకే త‌రానికి చెందిన వారు. ఒకే స‌మ‌యంలో ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కి ప్రాతినిధ్యం వ‌హించిన‌వారే.ప్రస్తుతం ఇండియ‌న్ క్రికెట్ టీమ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారే. వీరిలో హ‌ర్భ‌జ‌న్ ఐపీఎల్ క్రికెట్‌తో బిజీగా ఉన్నాడు. ఇర్ఫాన్ ఖాన్ కాశ్మీర్ టీమ్‌కు కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక శ్రీశాంత్ గురించి అంద‌రికీ తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ కార‌ణంగా క్రికెట్ నుండి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన శ్రీశాంత్ .. ఇప్పుడు క్రికెట్ కంటే సినిమాల్లోనే యాక్టివ్‌గా ఉన్నాడు. బాలీవుడ్‌, శాండీవుడ్‌లో న‌టిస్తున్నాడు. తెలుగులో కూడా న‌టించేశాడు. ఇప్పుడు కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.