తుఫాన్‌ అలర్ట్‌.. 16 నాటికి అత్యంత తీవ్రంగా ‘తౌక్టే’

  • IndiaGlitz, [Saturday,May 15 2021]

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఈ తుపాన్ శనివారం ఉదయం లక్షద్వీప్ వద్ద కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ‘తౌక్టే’ తుపాను 16 నాటికి అత్యంత తీవ్రంగా మారుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 18న గుజరాత్‌ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాను కారణంగా గంటకు 150 నుంచి 175 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని తెలిపింది. మరోవైపు ఈ తుపాను ప్రభావం కేరళపై తీవ్రంగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తుపానును ఎదుర్కొనేందుకు కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంతమేర ఈ తుపాను ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో శని, ఆదివారాల్లో 30-40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇది ఋతుపవనాల రాకకు శుభ సంకేతమని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుపాను ముప్పు దృష్ట్యా మహారాష్ట్ర గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేశాయి.

More News

బ్లాక్ ఫంగస్ రావడానికి ఆ నీరే కారణం..!

ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా యావత్ భారతదేశం అల్లాడుతుంటే.. ఇది చాలదన్నట్టు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కూడా వచ్చేసింది.

కొవిడ్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో

కొవిడ్ బాధితులకు భారతీయ రక్షణ సంస్థ(డీఆర్‌డీవో) గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారంలో

ఈటలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి కేటీఆర్!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను రాజకీయంగా పూర్తిగా దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది.

రఘురామ అరెస్ట్.. ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..

కొన్ని నెలలుగా వైసీపీకి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరింత మందికి సాయం అందిస్తున్నారు.