close
Choose your channels

కొవిడ్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో

Saturday, May 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొవిడ్ బాధితులకు భారతీయ రక్షణ సంస్థ(డీఆర్‌డీవో) గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారంలో కొవిడ్ చికిత్సకు ఉపయోగించే 2డీజీ మెడిసన్ డోసులు తొలి విడతలో భాగంగా 10,000 విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. రెడ్డి ల్యాబ్స్ సహకారంతో ముందుగా మన హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్ తయారు చేయబోతున్నట్టు డీఆర్‌డీవో వెల్లడించింది. అనంత్ నారాయణ్ భట్ సారథ్యంలోని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఈ డ్రగ్‌ను తయారు చేశారు. శుక్రవారం కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె. సుధాకర్ డీఆర్‌డీవో క్యాంపస్‌ను సందర్శించారు. డీఆర్‌డీవో సైంటిస్టులు 2 డీజీ డ్రగ్ గురించి.. అది ఎలా కోవిడ్ 19 చికిత్సలో ఎలా గేమ్ ఛేంజర్‌లా మారుతుందనే విషయాన్ని ఆయనకు వివరించారు.

ఈ డ్రగ్ ఎలా పని చేస్తుందంటే..

కరోనా రోగుల ఆక్సిజన్ లెవల్ తగ్గిపోవడంతోపాటు వారి పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారుతుంది. అలాంటి రోగుల సమస్యలకు యాంటీ కోవిడ్ డ్రగ్ అయిన 2-డీజీని బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రగ్ ప్రత్యేకత ఏంటంటే.. ఏదైనా వైరస్ శరీరంలో మిగతా కణాలను ఇన్ఫెక్ట్ చేస్తున్నప్పుడు, ఈ మందు అది తెలుసుకుని ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ఆ వైరస్‌ లోపలికే వెళ్తుంది తద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించేస్తుంది. మన శరీరంలోకి గ్లూకోజ్ ఎలా వెళ్తుందో ఈ మందు కూడా అలాగే పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్‌కు గురైన కణాల్లోకి చేరి వాటి శక్తిని తగ్గిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాపించడాన్ని అరికడుతుంది. తద్వారా రోగి కోలుకునేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Also Read: గుండె పగిలే వార్త ఇది.. ధీర యువతి ఇకలేరు!

ఎవరికి వినియోగిస్తారు?

అయితే ఈ డ్రగ్ కరోనా బారిన పడిన రోగులకు మాత్రమే ఉపయోగపడుతుంది. కరోనా రాకుండా నివారించడానికి ఉపయోగపడదు. దీనిని ఆస్పత్రిలో ఒక మోస్తరు నుంచి తీవ్ర పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులపై మాత్రమే ఉపయోగించాలి. ఆక్సిజన్ సపోర్ట్‌ లేదా ఐసీయూలో ఉన్న రోగులకు ఇది ఒక దివ్యౌషధం. ట్రయల్స్ సమయంలో అలాంటి రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్ గ్లూకోజ్ అనలాగ్. జనరిక్ మాలిక్యూల్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి దీనిని త్వరగా తయారు చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రగ్ పౌడర్‌ రూపంలో దొరుకుతుంది. దానిని గ్లూకోజ్‌లాగే నీళ్లలో కలిపి ఉపయోగించవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.