'డియర్ కామ్రేడ్' కి రిపేర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ప్రస్తుతం సెన్సేషనల్ హీరో అనే క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. `పెళ్ళిచూపులు`తో హీరోగా తొలి సక్సెస్ సాధించిన ఈ యువ హీరో, తదుపరి చిత్రం `అర్జున్ రెడ్డి `తో స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు.అలాగే నెక్ట్స్ మూవీ `గీత గోవిందం`తో రూ.100 క్లబ్లో చేరాడు. అదే ఊపులో ఆన్ లైన్లో లీకైనప్పటికీ `టాక్సీవాలా`తో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు అందరి కళ్లు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం `డియర్ కామ్రేడ్`పైనే ఉంది. ముందు ఈ సినిమాను మే 31నే విడుదల చేయాలనుకున్నారు.
దక్షిణాది భాషల్లో విడుదల చేయాలి కాబట్టి మంచి రిలీజ్ డేట్ చూసుకుని సినిమాను జూలై 26కి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా రీషూట్స్ జరుపుకుంటుందని. సినిమా చిత్రీకరణ తర్వాత ఇంకా బెటర్ మెంట్ కావాలని విజయ్ భావించడంతో రీపేర్లు జరుగుతున్నాయని గుసగుసలు వినపడుతున్నాయి. మరో పక్క రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో సినిమా అనుకున్న సమయంలో విడుదలవుతుందా? అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ అనుమానాలకు కామ్రేడ్ ఎలాంటి సమాధానం ఇస్తాడో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.