close
Choose your channels

త‌నదైన మార్కుతో మారుతి

Monday, March 30, 2020 • తెలుగు Comments

మారుతి.. ఆయ‌న కెరీర్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ చాలా మార్పు క‌న‌ప‌డుతుంది. మినిమ‌మ్ బ‌డ్జెట్‌తో, మినిమం హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు మారుతి. ఆయ‌న కెరీర్‌లో భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, గ‌త ఏడాది విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రాలు భారీ హిట్ చిత్రాలు చెప్పుకోవ‌చ్చు. స‌దురు హీరోల‌కు కూడా మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు ఈయ‌న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడని సినీ వ‌ర్గాల స‌మాచారం. మారుతి త‌న‌దైన శైలిలో ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు.

ఇస్మార్ట్‌శంక‌ర్ వంటి భారీ హిట్ త‌ర్వాత రెడ్ చిత్రంలో రామ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ఏప్రిల్ 9న రెడ్ సినిమా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. అయితే లాక్ డౌన్ ఎత్తేయ‌గానే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రామ్ రెడీ అవుతాడ‌ని అంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz