close
Choose your channels

కేజీఎఫ్ మేకర్స్ చేతుల్లో డా. రాజ్‌కుమార్ మనవడి ఎంట్రీ.. లుక్ వైరల్

Wednesday, April 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘కేజీఎఫ్ 2’ సూపర్‌హిట్ కావడంతో చిత్రబృందం సక్సెస్ జోష్‌లో వుంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పేరు కూడా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. దీంతో హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే మహిళా దర్శకురాలు సుధా కొంగరతో ఓ సినిమాను ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్ తాజాగా మరో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని అనౌన్స్ చేసింది. కన్నడ దిగ్గజ నటుడు రాజ్‌కుమార్ మనవడి ఎంట్రీ బాధ్యతను తీసుకుంది.

నట చక్రవర్తిగా, కన్నడ కంఠీరవుడిగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు డాక్టర్ రాజ్‌కుమార్. ఆయన తర్వాత శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్‌లు .. కన్నడ కంఠీరవుడి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూడో తరంలో ఆయన మనవళ్లు కూడా సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్ రాజ్‌కుమార్ మనవడు, యువ రాజ్‌కుమార్ సినీరంగ ప్రవేశం ఖరారైంది. సంతోషం ఆనంద్‌రామ్ తదుపరి చిత్రంలో యువ రాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా యువ రాజ్‌కుమార్‌ లుక్‌ను కూడా పంచుకున్నారు మేకర్స్. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో గంభీరంగా కనిపిస్తోన్న అతని లుక్ వైరల్ అవుతోంది. అలాగే ‘‘ది లెగసీ కంటిన్యూస్” అని రాసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో మిగిలిన తారాగణం, టెక్నీషియన్లకు సంబంధించిన వివరాలను ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం వుంది. యువ రాజ్‌కుమార్, డాక్టర్ రాజ్‌కుమార్ పుట్టినరోజులు ఏప్రిల్ లోనే వుండటంతో ఈ నెలకు ప్రత్యేక ప్రాధాన్యత వచ్చింది.

యువ రాజ్‌కుమార్... డాక్టర్ రాజ్‌కుమార్ ద్వితీయ కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు, యువ హీరో వినయ్ రాజ్‌కుమార్‌‌కి సోదరుడు. ఇతని ఎంట్రీని ఒక చారిత్రాత్మక చిత్రంతో ప్రారంభిస్తారని శాండిల్‌వుడ్‌లో ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి ‘‘యువ రణధీర కంఠీరవ’’ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. దివంగత పునీత్ రాజ్‌కుమార్‌తో ‘యువరత్న’తో సహా పలు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ ఆనంద్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా వున్నాయి. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.