close
Choose your channels

Remote Voting:  సొంతూరికి దూరంగా వుంటున్నారా.. ఇకపై ఎక్కడున్నా ఓటు వేయొచ్చు, రిమోట్ ఓటింగ్‌పై ఈసీ ఫోకస్

Wednesday, June 8, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము లాంటిది. అయినప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా కొన్ని సంస్కరణలు చేస్తోంది. ముఖ్యంగా విధి నిర్వహణ, ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో వున్న వారు తమ స్వస్థలాల్లో ఓట్లు వేయడం కుదరడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడున్న సరే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

పరిశీలనలో రిమోట్ ఓటింగ్:

దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కమిటీ వేయనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లో ఉండి తమ ఓటును కోల్పోతోన్న ఓటర్ల సమస్యలపై ఇందులో చర్చించనున్నారు. ఈ క్రమంలోనే రిమోట్ ఓటింగ్ విధానం సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ రిమోట్ ఓటింగ్ ఆమోదించబడితే అది ఓటింగ్ శాతాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఇంటి నుంచి దూరంగా ఉండేవారు, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేని వ్యక్తులు కూడా ఓటు వేసే వెసులుబాటు వుంటుంది. మరోవైపు.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ ఎందుకు తక్కువగా నమోదవుతుందన్న అంశంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో ఓటు వేసేందుకు వెళ్లేందుకు వీలుగా ఓటింగ్ రోజున సెలవు ప్రకటిస్తుంది. అయితే సెలవు తీసుకున్నా ఓటు వేయని ఉద్యోగులు భారీగా వున్నారు.

విదేశాల్లోని భారతీయుల కోసం పోస్టల్ బ్యాలెట్:

కాగా... దేశంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ లక్షలాది మంది బయటకు వెళ్తున్నారు. వీరిలో చాలా మంది ఎంపీ-ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు తమ గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఓటరు దేశంలోని ఏ పోలింగ్ స్టేషన్‌లోనైనా ఓటు వేయగలరు. దీనితో పాటు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు పోస్టల్ బ్యాలెట్‌ను ప్రారంభించే అంశానికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.