close
Choose your channels

'నార‌ప్ప' చిత్రం నుండి ఫ్యామిలి పోస్ట‌ర్ విడుద‌ల‌

Tuesday, April 13, 2021 • తెలుగు Comments

విక్టరి ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా,మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ ప‌తాకాల‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాగా ఈ రోజు (ఏప్రిల్ 13) తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ‌ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని నార‌ప్ప ఫ్యామిలీతో కూడిన స్పెష‌ల్ ఫ్యామిలి పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. తెలుగు వారి సాంప్రదాయ వస్త్రధారణ పంచెక‌ట్టులో విక్ట‌రి వెంక‌టేష్ న‌డిచివ‌స్తోన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

Get Breaking News Alerts From IndiaGlitz