close
Choose your channels

ఫ్యాన్సీ రేటుకు ‘వ‌కీల్‌సాబ్’ శాటిలైట్.. డిజిటిల్ హ‌క్కులు

Sunday, February 28, 2021 • తెలుగు Comments

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం వ‌కీల్ సాబ్ శాటిలైట్ హ‌క్కుల‌ను ప‌దిహేను కోట్ల రూపాయ‌ల‌కు ప్ర‌ముఖ జీ స్టూడియోస్‌కు ఇచ్చార‌‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే డిజిట‌ల్ హ‌క్కులు మాత్రం జీ స్టూడియోకు ఇవ్వ‌కుండా ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌కు ఇచ్చార‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 9న సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజి బిజీగా ఉన్నాడు. ఒక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(వినిపిస్తోన్న టైటిల్‌) కాగా.. మ‌రో చిత్రం సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమా రీమేక్‌. ఇందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు రానా ద‌గ్గుబాటి కూడా న‌టిస్తుండ‌టం విశేషం.

Get Breaking News Alerts From IndiaGlitz