close
Choose your channels

నడిగర్ సంఘం భవంతిలో అగ్ని ప్రమాదం

Monday, December 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోలీవుడ్‌కి చెందిన నడిగర్ సంఘం ఉన్న భ‌వంతిలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. నడిగర్ సంఘం ఆఫీస్‌లో మంటలకు పలు కీలక ఫైల్స్ బూడిదయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కొంత సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. నడిగర్ సంఘానికి చెందిన నిధులు ఎంతున్నాయి.. ఎంత ఖర్చు అయ్యాయి అనే విష‌యాల‌కు సంబంధించిన కీలక ఫైల్స్ ఆ భవనంలో ఉంటాయి.

అంతేకాకుండా.. నాజర్ నడిగర్ సంఘ అధ్యక్షుడిగా, విశాల్ కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో న‌డిగ‌ర్ సంఘం ఏ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి ఎంత మేర‌కు నిధులు సేక‌రించింది అనే వివ‌రాలకు సంబంధించిన ప‌త్రాల‌న్నీ కూడా ఈ ఆఫీసులోనే ఉంటాయ‌ని తెలుస్తోంది. కాగా.. ఈ ప్రమాదం నిజంగానే ప్ర‌మాద‌వశాత్తు జరిగిందా? లేదంటే ఎవ‌రైనా కావాల‌నే చేయించారా? అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.