close
Choose your channels

హ్యపీ బర్త్ డే టు అక్కినేని అఖిల్

Saturday, April 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావుది ఓ చెరగని అధ్యాయం. తనదైన నటనతో ఆయన తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఆయన నట వారసుడిగా రెండవ తరంలో వచ్చిన కింగ్‌ నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కింగ్‌గా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తున్నారు. ఇప్పుడు అక్కినేని మూడోతరంలో యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య, యాత్‌ కింగ్‌ అక్కినేని అఖిల్‌ ట్రెండ్‌ స్టార్టయ్యింది.
చిచ్చర పిడుగు సిసింద్రీగా....
తండ్రి అక్కినేని నాగార్జున నిర్మించిన సిసింద్రీ చిత్రంతో నెలల బాలుడిగా అఖిల్‌ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో అఖిల్‌ చూపిన అభినయం ప్రేక్షకులు హృదయాల్లో తనకు సుస్థిర స్థానాన్ని ఏర్పరిచింది. తండ్రి నాగార్జునతో కలిసి ఈ చిత్రంలో అఖిల్‌ చేసిన అల్లరి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నటుడిగా అఖిల్‌ తొలి అడుగులు 'సిసింద్రీ' చిత్రంతోనే ప్రారంభమయ్యాయి.
అఖిల్‌... 'మనం' చిత్రంలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌
మూడు తరాల నటులు కలిసి నటించిన క్రెడిట్‌ సంపాదించుకున్న ఫ్యామిలీ అక్కినేనివారిది. 'మనం' చిత్రంతో ఈ క్రెడిట్‌ను అక్కినేనివారు సొంతం చేసుకున్నారు. ఒకే వంశానికి చెందిన మూడు తరాల నటులు కలిసి నటించిన ఫ్యామిలీ మల్టీస్టారర్‌ మనం ఇండియన్‌ సినిమాలోనే సెకండ్‌ మూవీగా, దక్షిణాదిన తొలి మూవీగా నిలిచింది. అంతే కాకుండా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం క్లైమాక్స్‌లో యూత్‌కింగ్‌ అఖిల్‌ మెరుపులా మెరిసి అందరినీ మెస్మరైజ్‌ చేశారు.
'అఖిల్‌' చిత్రంతో హీరోగా సెన్సేషనల్‌ లాంచింగ్‌
అఖిల్‌ హీరోగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూసిన అభిమానుల ఆశలను నిజం చేస్తూ శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై హీరో నితిన్‌ నిర్మాతగా ప్రెస్టిజియస్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో అఖిల్‌ చిత్రంతో అఖిల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫైట్స్‌, డ్యాన్సులతో అదరగొట్టాడు
అఖిల్‌. సక్సెస్‌ఫుల్‌ సిసిఎల్‌ కెప్టెన్‌గా..
సినిమాల ఎంట్రీ కంటే ముందే అఖిల్‌ సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో తెలుగు వారియర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును విజయపథంలో నడిపించాడు. వరుసగా రెండుసార్లు కప్‌ను అందించడమే కాకుండా విజయాల్లో కెప్టెన్‌గా కీలకపాత్రను పోషించాడు.
కమర్షియల్‌ యాడ్స్‌లోనూ..
సినీ ఎంట్రీ కంటే ముందే తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న అఖిల్‌ కమర్షియల్‌ యాడ్స్‌లో కనిపించాడు. సినిమాల కంటే ముందు కమర్షియల్‌ యాడ్స్‌లో నటించిన స్టార్‌ కూడా అఖిల్‌ కావడం గమనార్హం. టైటాన్‌ వాచెస్‌, మౌంటెన్‌ డ్యూ వంటి పలు కమర్షియల్‌ యాడ్స్‌లో నటించి మెప్పిస్తున్నారు. ప్రస్తుతం 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కమార్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు.
అక్కినేని మూడోతరం హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే హీరోగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన అక్కినేని అఖిల్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8. ఈ సందర్భంగా యూత్‌కింగ్‌ అక్కినేని అఖిల్‌కు బర్త్‌డే విషెస్ టు అఖిల్ అక్కినేని.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.