close
Choose your channels

దిల్‌రాజుతో గొడవలపై హరీశ్ శంకర్ స్పందన

Monday, September 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిల్‌రాజుతో గొడవలపై హరీశ్ శంకర్ స్పందన

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. త్వరలో సినిమా థియేటర్లలోకి రానుండటంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరుపుకున్న చిత్రబృందం.. దర్శక నిర్మాతలు, నటీనటులు మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇదీ వివాదం!

ఈ సందర్భంగా సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజుతో ఉన్న వివాదాలపై హరీశ్ స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చారు. ‘దిల్ రాజు నిర్మాతగా ‘దాగుడుమూతలు' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. అయితే కొన్ని కారణాల వలన అది కుదరలేదు. దిల్ రాజుతో నేను గొడవపడినట్టుగా వార్తలు షికారు చేశాయి. నిజానికి దిల్ రాజుతో పెద్ద గొడవేం జరగలేదు. కాస్టింగ్ విషయంలోనే ఆయనతో ఇబ్బంది.. అంతే. అవి అభిప్రాయం భేదాలు కాదండి కేవలం, క్రీయేటివిటీ భేదాలు మాత్రమే. ఒక చిత్రం విషయంలో నటీనటుల విషయంలో మా అభిప్రాయాలు కలవలేదు. అంతే కానీ అదేమీ గొడవ కాదు. మా చిత్రం వాల్మీకి వైజాగ్ ఏరియా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు’ అని హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చుకున్నారు. మొత్తానికి చూస్తే హరీశ్ మాత్రం ఈ గొడవలపై క్లారిటీల ఇచ్చేశారు..మరి దిల్ ఎలా రియాక్ట్ అవుతారా వేచిచూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.