'యన్.టి.ఆర్' కి నిత్యా నో చెప్పిందా?

  • IndiaGlitz, [Sunday,February 04 2018]

మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా యన్.టి.ఆర్' పేరుతో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నంద‌మూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఎన్టీఆర్ జీవితంలోని సినీ, రాజకీయ రంగాలకు సంబంధించిన పాత్రలకి.. నటులను ఎంపిక చేయడం చిత్ర యూనిట్‌కు తలకి మించిన భారంగా మారుతోంది.

ఇప్పటికే నటుల ఎంపిక కోసం తేజ ఫేస్ రికగ్నేషన్ పద్ధతిని అవలంబించినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే...ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం ఇటీవ‌ల కేర‌ళ‌కుట్టి నిత్యా మీనన్‌ను సంప్రదించారట‌ దర్శకుడు. ఆమె కూడా ఈ పాత్ర కోసం మొదట‌ ఆసక్తిని కనబరచిన‌ప్ప‌టికీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇప్పుడు సున్నితంగా నో చెప్పింద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పాత్ర కోసం మరొక నటీమణిని అన్వేషించే ప‌నిలో పడింది చిత్ర బృందం. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం త్వరలోనే చిత్రీకరణ జరుపుకోనుంది.

More News

విజయేంద్ర ప్రసాద్ కథతో విష్ణు చిత్రం?

అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి.అతని విజయాల వెనకుండి నడిపిస్తున్న అదృశ్యవ్యక్తి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్.

ఫిబ్రవరి 14న నా పేరు సూర్య రెండో పాట....

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అనుఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం'నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా'.

ఒక్కరితో మొదలై...లక్షలాది సైన్యంగా మనంసైతం..

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ మనం సైతం దిగ్విజయంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

క్లైమాక్స్ పూర్తిచేసుకున్న 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’.

బరువు తగ్గిన శర్వానంద్

ఓ రొమాంటిక్ లవ్ స్టొరీని,క్రేజీ కాంబినేషన్ తో ఒక యూత్ ఫుల్ డైరెక్టర్ తెరకెక్కిస్తే ఎలా వుంటుంది?