అనుష్క సినిమాలో ఆ న‌టుడికి 3 కోట్లు

  • IndiaGlitz, [Monday,January 21 2019]

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని బాహు భాషా చిత్రాన్ని నిర్మించనున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. 'హార్రర్ ధ్రిల్లర్' గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టిల‌తో పాటు అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

'వ‌స్తాడు నా రాజు' ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభమవుతుందని, 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల చేసేలా నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ న‌టుడు మైకేల్ మ్యాడ్‌సెన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈయ‌నకు ఈ సినిమాలో న‌టించ‌డానికిగానూ మూడు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను ఇస్తున్నార‌ట‌.

More News

కొర‌టాల స్క్రిప్ట్‌ను వ‌ద్ద‌న్న చిరు

మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్ హీరోయిన్‌తో గోపీచంద్‌

బాలీవుడ్ హీరోయిన్స్‌, న‌టీన‌టులను టాలీవుడ్‌లో న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.

ఫిబ్రవరి 22న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2'

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 .

మ‌ణిక‌ర్ణిక నిర్మాత‌కు అస్వ‌స్థ‌త‌

కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌:  ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఈ సినిమాకు క‌మ‌ల్ జైన్ నిర్మాత‌.

బ‌న్నీకి మూడు మిలియ‌న్స్ ...

ఇంత‌కు మూడు మిలియ‌న్స్‌.. బ‌న్నికీ ఎంట‌ని అనుకుంటున్నారా? ట‌్విట్ట‌ర్‌లో ఆయ‌న ఫాలోవ‌ర్స్‌. ఇంత మంది ఫాలోవ‌ర్స్‌ను రీచ్ కాగానే.. బ‌న్ని త‌న అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్పాడు.