మణికర్ణిక నిర్మాతకు అస్వస్థత
Send us your feedback to audioarticles@vaarta.com
కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఈ సినిమాకు కమల్ జైన్ నిర్మాత. ఆయన ఉన్నట్లుండి అస్వస్థతకు గురికావడంతో దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కమల్ పక్షవాతానికి గురయ్యారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
"ఆసుపత్రిలో చేరాల్సిన సమయం కాదు. ఫలితం దక్కే సమయంలో ఇలా అనారోగ్యానికి గురించి అంత కంటే సబబు కాదు. ప్రమోషన్స్‌లో యూనిట్‌ను చాలా మిస్ అవుతున్నాను. వీలైనంత తర్వగా కోలుకుని తిరిగి వస్తాను. కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న జీ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. మన డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం.. జైహింద్" అంటూ కమల్ జైన్ ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేశారు.
జాగర్లమూడి క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 28 నిమిషాల వ్యవధితో సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.