close
Choose your channels

ఫిబ్రవరి 22న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2'

Sunday, January 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫిబ్రవరి 22న ప్రేమ‌క‌థాచిత్రమ్ 2

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ ద్వారా కోటి 43 ల‌క్ష‌లు దక్కించుకోవడం విశేషం. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న మరో ప్ల‌స్ అవుతుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ "ప్రేమ కథా చిత్రం 2" చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 ని కూడా అంతే క్రేజ్ తో రూపొందిస్తున్నాం. హిందీ శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ ని కొటి న‌ల‌భై మూడు ల‌క్ష‌ల‌కి కొనుగోలు చేశారు. మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు రావు రమేష్ గారు ఈ చిత్రం కోసం వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం. ఆయన వాయిస్ ఓవర్ తో ప్రేక్షకులు కథలోకి లీనమవుతారు. ఆయనకు ఈ సందర్భంగా మా యూనిట్ తరపున స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాం.

ఇక ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మ‌రో హీరోయిన్ గా నటిస్తున్నారు. విధ్యుల్లేఖ‌, ప్ర‌భాస్ శ్రీను మ‌ధ్య వ‌చ్చే కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న మా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందనే నమ్మకముంది. అని అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.