సెన్సార్ పూర్తి చేసుకొన్న'హార్ట్ బీట్'

  • IndiaGlitz, [Saturday,December 30 2017]

ధృవ, వెంబ జంటగా దేవాస్ మీడియా & ఎంటర్ టైన్మెంట్ పతాకంపై శ్యామ్ దేవభక్తుని నిర్మాణ సారధ్యంలో ద్వారక్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హార్ట్ బీట్'. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకొంది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్యామ్ దేవభక్తుని మాట్లాడుతూ.. "ఒక 16 ఏళ్లమ్మాయి తనకంటే వయసులో పెద్దవాడైన యువకుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం 'హార్ట్ బీట్'. ఎక్కడా అసభ్యతకు, అశ్లీలతకు తావులేకుండా చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాం. మా డైరెక్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకొన్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "హార్ట్" బీట్" చిత్రాన్ని అతీత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

More News

టైటిల్ మారేస్తేనే రిలీజట‌...

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజపుత్ర మ‌హారాణి ప‌ద్మావ‌తి జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సంజ‌య్ లీలా భన్సాలీ తెర‌కెక్కించారు. ఇందులో ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్‌, రాజా ర‌త‌న్ సింగ్ పాత్ర‌లో షాహిద్ క‌పూర్ న‌టించారు.

నెక్ట్స్ కూడా రీమేకేనట..

యంగ్ హీరో నిఖిల్ చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.

అంతా అక్క‌డే అంటున్న ప్ర‌భాస్‌..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఈ ఏడాది ఇక్క‌డ కాకుండా లాస్ ఏంజిల్స్‌లో ప్లాన్ చేశాడ‌ట‌. అందులో భాగంగా ఇప్ప‌టికే లాస్ ఏంజ‌ల్స్ చేరుకున్నాడ‌ట ప్ర‌భాస్‌. త‌న స్నేహితులో క‌లిసి కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ప్ర‌భాస్ జ‌రుపుకుంటున్నాడ‌ట‌.

సుధీర్ బాబు - ఇంద్రగంటి చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి!

సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.

కథ విన్నఅరవింద్ ఏం చెప్పారంటే...?

అల్లు శిరీష్,సురభి,అవసరా శ్రీనివాస్,శీరత్ కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఒక్క క్షణం'.