close
Choose your channels

సుధీర్ బాబు - ఇంద్రగంటి చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి!

Saturday, December 30, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుధీర్‌బాబు హీరోగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్త‌యింది. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.

నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ `` డిసెంబ‌ర్ 11 నుంచి 23 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ చేశాం. హీరో ఇంటికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌వీంద‌ర్ రూపుదిద్దిన హీరో హౌస్ సెట్ చాలా స్పెష‌ల్‌గా ఉంటుంది. ఈ స‌న్నివేశాల్లో ఆ సెట్ ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. అవుట్ ఫుట్ చాలా సంతృప్తి కరం గా వస్తోంది . జ‌న‌వ‌రి 1 నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. అది కూడా భాగ్య‌న‌గ‌రంలోనే ఉంటుంది. ఇంకా టైటిల్‌ ఖ‌రారు చేయ‌లేదు. సంక్రాంతి త‌ర్వాత టైటిల్ ప్ర‌క‌టిస్తాం.మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం `` అని అన్నారు.

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ `` రొమాన్స్, హాస్యం స‌మ్మిళిత‌మైన క‌థ ఇది. ఈ సినిమాలో హీరో చిల్డ్ర‌న్ బుక్స్ ఇల్ల‌స్ట్రేట‌ర్‌గా న‌టిస్తున్నారు. అనూహ్య‌మైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది. పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ హైలైట్ అవుతుంది`` అని చెప్పారు.

సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, రాహుల్ రామ‌కృష్ణ‌, పవిత్ర లోకేష్ ,కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మేక‌ప్‌: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఎన్‌. మ‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.