నెక్ట్స్ కూడా రీమేకేనట..

  • IndiaGlitz, [Saturday,December 30 2017]

యంగ్ హీరో నిఖిల్ చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌ణ్ కోపిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ సినిమా రీమేక్ 'కిర్రాక్ పార్టీ'లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా జ‌న‌వ‌రి కంతా దాదాపు పూర‌య్యే అవ‌కాశాలున్నాయి. దాంతో నిఖిల్ త‌న త‌దుప‌రి సినిమాను సైట్స్‌పైకి తీసుకెళ్లే యోచ‌న‌లో ఉన్నాడు. నిఖిల్ చేయ‌బోయే త‌దుప‌రి సినిమా కూడా రీమేకే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈసారి త‌మిళ సినిమా రీమేక్‌లో నిఖిల్ నటించ‌బోతున్నాడు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన క‌ణిద‌న్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తార‌ట‌. ఇది జ‌న‌వ‌రి 19న ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌నేది స‌మాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ట‌.

More News

అంతా అక్క‌డే అంటున్న ప్ర‌భాస్‌..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఈ ఏడాది ఇక్క‌డ కాకుండా లాస్ ఏంజిల్స్‌లో ప్లాన్ చేశాడ‌ట‌. అందులో భాగంగా ఇప్ప‌టికే లాస్ ఏంజ‌ల్స్ చేరుకున్నాడ‌ట ప్ర‌భాస్‌. త‌న స్నేహితులో క‌లిసి కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ప్ర‌భాస్ జ‌రుపుకుంటున్నాడ‌ట‌.

సుధీర్ బాబు - ఇంద్రగంటి చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి!

సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.

కథ విన్నఅరవింద్ ఏం చెప్పారంటే...?

అల్లు శిరీష్,సురభి,అవసరా శ్రీనివాస్,శీరత్ కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఒక్క క్షణం'.

కొత్త దర్శకులు ..పెద్ద సక్సెస్ లు

సినిమా పరిశ్రమలో కొత్త టాలెంట్ కు రెడ్ కార్పెట్ ఎప్పుడూ ఉంటుంది. మనం చెప్పే పాయింట్ పాతదే కావచ్చు కానీ..దాన్ని ఆడియెన్స్కు నచ్చేలా ఎలా ప్రెజెంట్ చేశామనేదే ముఖ్యం. ఏటా దాదాపు రెండు వందలు సినిమాలు విడుదలవుతుంటాయి.

2017 సమీక్ష - సినీ వివాదాలు

సినిమా అంటే రంగలు ప్రపంచం..వినోదాలను పంచే హరివిల్లు అని అనుకుంటారు. ప్రతి ఏడాది ప్రేక్షకులకు వినోదాలను పంచిన సినిమాలెన్నో. అలాంటి సినిమా పరిశ్రమపై ఈ ఏడాది వచ్చిన వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.