close
Choose your channels

నేను ఎవరికీ భయపడను.. : బాలయ్య

Tuesday, June 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేను ఎవరికీ భయపడను.. : బాలయ్య

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం.. ఇలా వివాదం ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈ వివాదానికి తాజాగా ఓ ప్రముఖ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య స్పందించారు. ఇదే ఇంటర్వ్యూలో పలు విషయాలపై బాలయ్య స్పందించారు.

నేను ఎవరికీ భయపడను.. ఫాలో అవ్వాల్సిందే.

‘ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్లు, తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల జరిపారు. నేను దేనిలో ఇన్వాల్వ్ కాను. నేను ఎవరికీ భయపడను (నాగబాబు వ్యాఖ్యలపై). నా వ్యక్తితత్వం గురించి భయం లేదు. నాకు ఎవరైనా మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలంతే. నేను ఇది నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. నన్ను వేరుగా చేస్తే మాత్రం తిక్కరేగుతుంది. ఇండస్ట్రీలో ఎవరైనా మమ్మల్ని ఫాలో కావల్సిందే. చరిత్ర సృష్టించాలన్న మేమే.. దాన్ని తిరగరాయాలన్న మేమే. నాకు అన్నీ నా తండ్రి అలవాట్లే ఉన్నాయి. నాన్న గారికి చుట్ట కాల్చే అలవాటు ఉన్నట్టే.. నాకు చుట్ట కాల్చడం అలవాటు అయింది’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. కాగా ఇదే ఇంటర్వ్యూ వేదికగా మల్టీస్టారర్ మూవీతో పాటు ఇదివరకు ఇదే టాలీవుడ్‌లో జరిగిన పలు ఆసక్తికర విషయాలు, నందమూరి వీరాభిమానుల గురించి సైతం బాలయ్య చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.