Nara Bhuvaneshwari:చంద్రబాబు గారికి విశ్రాంతి ఇచ్చి కుప్పం నుంచి నేను పోటీ చేస్తా: భువనేశ్వరి

  • IndiaGlitz, [Wednesday,February 21 2024]

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తుంటే.. మరోవైపు పొత్తుల నేపథ్యంలో టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారుతోంది. దీంతో ఇరు పార్టీల నాయకులు టికెట్ తమకంటే తమకు అని ప్రకించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుప్పం నుంచి ఏడు సార్లు గెలిచిన చంద్రబాబుకు ఈసారి విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు.

నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. కుప్పంలో రెండు కుటుంబాలను ఆమె పరామర్శించి మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సయం చేశారు. అనంతరం 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మనసులో ఒక కోరిక కలిగిందని తెలిపారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారని.. ఈసారి తనకు పోటీ చేయాలని ఉందని.. తనను గెలిపిస్తారా..? అని అడిగారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

దీంతో అధికార వైసీపీ నేతలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు స్థానంలో కుప్పం నుంచి పోటీ చేస్తానని భువనేశ్వరి గారు ప్రకటించారు. ఆమె మాటతో టీడీపీ, జనసేన కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు. నిజంగానే ఆమె చెప్పినట్టు నువ్వు రెస్ట్ తీసుకునే సమయం వచ్చింది చంద్రబాబూ..! అంటూ వైసీపీ తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో పోస్ట్ చేసింది.

దీనిపై తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. భువనేశ్వరి గారు చెప్పింది ఏంటి, ఈ సైకో ఫేక్ చేసింది ఏంటో చూడండి. ఇలా తృప్తి పడుతూ, శునకానందం పొందే బ్రతుకులూ బ్రతుకేనా? అంటూ ఆమె మాట్లాడిన పూర్తి వీడియోను ట్వీట్ చేసింది.

వాస్తవంగా భువనేశ్వరి ఏం మాట్లాడారంటే.. చంద్రబాబు గారిని 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అని అడిగారు. దాంతో సభకు వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు. అలా కుదరదు... ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ కోరారు. అయితే ఇది తాను సరదాగానే అంటున్నాను. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను.. మా ఆయన బాగా చూసుకుంటున్నారు. నాకు ఏ పోస్ట్ అవసరం లేదు. సరదాగా ఏదో జోక్‌గా అన్నాను. అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలి అని వ్యాఖ్యానించారు.

More News

Medaram Jathara: మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

తెలంగాణ కుంభమేళాగా పేరు గడించిన మేడారం మహా జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. గిరిజనుల ఆరధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లు మేడారం వైపే కదిలాయి.

SGT Posts:ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్టే విధించింది.

SRK-Sandeep Reddy:ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్.. ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి..

బాలీవుడ్ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల(Dadasaheb phalke film festival)

Virat Kohli:విరాట్ కోహ్లి కుమారుడు 'అకాయ్‌' పేరుకు అర్థం ఏంటంటే..?

టీమిండియా రన్‌మెషీన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు మగ బిడ్డకు జన్మనిచ్చారు.

Pawan Kalyan:పత్రికా కార్యాలయాలపై దాడులు అప్రజాస్వామికం: పవన్ కల్యాణ్

కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. "వైసీపీ సర్కార్‌ వైఫల్యాలు,