close
Choose your channels

నేను చనిపోయేంతవరకూ వైసీపీలోనే.. జగన్‌తోనే ఉంటా!

Tuesday, June 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేను చనిపోయేంతవరకూ వైసీపీలోనే.. జగన్‌తోనే ఉంటా!

‘నేను చనిపోయేంత వరకు వైసీపీలోనే ఉంటాను.. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిగారితోనే ఉంటాను’ అని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా కొందరు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ పై విధంగా రియాక్ట్ అయ్యారు. కాగా.. ఏపీలో పెను దుమారం రేపుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌పై విజయసాయి మాట్లాడారు. ఇవాళ విశాఖపట్నంలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన అన్ని విషయాలపై నిశితంగా మాట్లాడారు.

బాబు, నిమ్మగడ్డ వ్యవహారంపై..

‘రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టించాడు. 151 సీట్లతో గెలిచిన ప్రజా ప్రభుత్వాన్ని కాదని, కౌన్సిల్‌లో తనకున్న బలంతో ఏపీలో ప్రజాస్వామ్యాన్ని, పరిపాలన వికేంద్రీకరణ, దళితులకు అందాల్సిన సామాజిక న్యాయం అందకుండా చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నాం. అడ్వకేట్‌ జనరల్‌ అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేష్‌ సమాధానం చెప్పలేదు. నా పోస్టు నాకు ఇచ్చేయండి అంటూ తనకు తాను సుమోటోగా ఆర్డర్లు రాసుకుంటున్నారు. ఏ ఆర్డర్‌ అయినా కూడా ప్రభుత్వం నుంచి రావాలని, ఓ అధికారి తనను తాను నియమించుకోవడం ఎక్కడా చూడలేదు. బహుశా ఇది నిమ్మగడ్డ రమేష్‌కే చెల్లుతుందేమో. యాక్సిస్‌ ఆఫ్‌ హీవిల్‌గా కనిపించడం లేదా..?. ఇటువంటి వ్యక్తుల బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, మనందరిపై ఉంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంపై విషం గక్కుతున్నారు. తమ ప్రభుత్వ లేకపోయినా తమ మనుషులు ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వస్తే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. న్యాయవ్యవస్థపై వైసీపీకి పూర్తి నమ్మకముంది’ అని విజయసాయి స్పష్టం చేశారు.

తప్పకుండా చర్యలుంటాయ్!

‘ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం మొత్తం ఈ రోజుకు మొదట ఒక 49 మందికి, రెండో లిస్టులో 44 మందికి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వైసీపీకి, పార్టీ కార్యకర్తలకు న్యాయం, చట్టం మీద అపారమైన నమ్మకం ఉంది. న్యాయస్థానాలను గౌరవించాం కాబట్టే అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మా పార్టీపై దొంగ కేసులు పెట్టినా.. పార్టీ అధ్యక్షులను అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెట్టినా శాంతియుతంగా కోర్టుల్లోనే పోరాటం చేస్తున్నాం. కోర్టులపై ఎటువంటి దూషణలు, అసాంఘిక చర్యలు పాల్పడలేదు. మాకు కోర్టులపై ఉన్న విశ్వాసానికి ఇదొక్కటే చిహ్నం. పదేళ్ల మా పార్టీ చరిత్రలో మేము గాంధేయ మార్గంలోనే నడిచాం. శాంతినే కోరుకుంటున్నాం. కానీ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా.. చట్ట విరుద్ధంగా చర్యలకు పాల్పడుతున్నారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వైసీపీ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు, మైనార్టీలకు అందరి ప్రయోజనాలను పరిరక్షించేందుకు పుట్టిన పార్టీ. ఆ వైపుగానే మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విధివిధానాలు కొనసాగుతాయి’ అని విజయసాయి స్పష్టం చేశారు.

అండగా ఉంటా..!

‘సోషల్‌ మీడియా కార్యకర్తలు, 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వం పెట్టిన కేసుల్లో నలిగిపోయారు. నీతి కోసం, నిజాయితీ కోసం వీర సైనికుల్లా సోషల్‌ మీడియా సైనికులు పనిచేశారు. ఇప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చి 49+44 మంది తప్పు చేశారనో.. చేయలేదనో చెప్పడం లేదు. వీరిలో వైసీపీ వారే ఉన్నారని చెప్పలేం. కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్లు నా పేరుతోనే ఫేక్‌ ఐడీలతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అకౌంట్లు క్రియేట్‌ చేసి మా పార్టీ అధ్యక్షులను దూషించారు. వైసీపీకి పనిచేస్తున్న వారు అయినా.. చేయకపోయినా వీరికి సపోర్టు చేస్తే కోర్టుల్లో ఎక్కడ కంటెమ్ట్‌ వస్తుందేమోనని భయపడే పరిస్థితుల్లో మేము లేము. గత ఐదున్నర సంవత్సరాలుగా ముఖ్యంగా సోషల్‌ మీడియా నేనే చూసుకుంటున్నా. మా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. ఈ రోజుకు ఒక కార్యకర్త అయినా కేసుల్లో ఇరుకున్నా.. వారికి అండగా ఉంటాను’ అని ఎంపీ హామీమ ఇచ్చారు.

జగన్ ఢిల్లీ పర్యటనలో..

సీఎం జగన్‌గారు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. హోంమంత్రి అమిత్ షా పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారని విజయసాయి తెలిపారు.

జగన్ షెడ్యూల్ ఇదీ..

- మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా పయనం

- 10:20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరిక

- 10:30 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పయనం

- మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరిక

- మధ్యాహ్నం 1:15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా జనపథ్‌ - 1కు బయలుదేరనున్న జగన్

- మధ్యాహ్నం 2 గంటలకు జనపథ్ - 1కు చేరిక. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos