క‌మ‌ల్ - రెహ‌మాన్‌ చేతులు క‌లిపారోచ్‌!

  • IndiaGlitz, [Tuesday,July 16 2019]

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించ‌నున్న సినిమాకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. క‌మ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో మెడ్రాస్ మొజార్ట్ రెహ‌మాన్ సంగీతం వ‌హిస్తున్న తొలి చిత్ర‌మిదే. నిన్న రాత్రి క‌మ‌ల్‌తో క‌లిసి రెహ‌మాన్ తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దాంతో ఈ కొత్త సినిమా గురించి వార్త‌లు మొద‌ల‌య్యాయి. అయితే తాజా చిత్రం గురించి వారిద్ద‌రూ ఏమీ స్పందించ‌లేదు. కానీ ఈ సినిమా 'కేన్ అమ‌ర్ హై' (త‌లైవ‌న్ ఇరుక్కిరాన్ అనే త‌మిళ ప్రాజెక్ట్) అని ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లైంది. 2015లోనే క‌మ‌ల్‌హాస‌న్ ఈ ప్రాజెక్ట్ గురించి వివ‌రించారు. సైఫ్ అలీ ఖాన్ హీరోగా, క‌మ‌ల్ విల‌న్‌గా న‌టించాల‌నుకుని నిర్ణ‌యించుకున్న చిత్ర‌మ‌ది. క‌మ‌ల్ హాస‌న్ సొంత సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌నల్‌తో పాటు లైకా ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందనుంది.

More News

'స‌రిలేరు..' లో జ‌గ‌ప‌తి లేరు!

టాలీవుడ్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు సీరియ‌స్ నోట్‌లో ఉన్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

ఎస్.. బాలయోగి ఆస్తులు కొట్టేశానంటున్న కేశినేని!

ఎంపీ కేశినేని నాని.. ఇప్పుడీ పేరు చెబితే తెలుగు తమ్ముళ్లకు చెమటలు పడుతున్నాయ్.. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ‘హీరో’ దొరికేశాడోచ్!!

ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో రాఘవేంద్రరావు ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అప్పట్లో స్వయానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా దర్శకేంద్రడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్ర‌భాస్ ప‌ర్య‌వేక్షిస్తున్నారా?

`సాహో`కి సంబంధించి అన్ని ప‌నుల‌నూ ప్ర‌భాస్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారా? ఇప్ప‌టిదాకా ఎంత సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ అయినా..

నీటి విలువ చెప్పిన స‌ల్లూభాయ్‌

బాటిళ్ల‌లో నీళ్లు పోసుకోవ‌డం, వాటిని కాళ్ల‌తో త‌న్న‌డం... స్టైల్‌గా కాళ్ల‌తో త‌న్నిన త‌న్నుకు ఆ మూత ఓపెన్ కావ‌డం..