close
Choose your channels

నీటి విలువ చెప్పిన స‌ల్లూభాయ్‌

Monday, July 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నీటి విలువ చెప్పిన స‌ల్లూభాయ్‌

బాటిళ్ల‌లో నీళ్లు పోసుకోవ‌డం, వాటిని కాళ్ల‌తో త‌న్న‌డం... స్టైల్‌గా కాళ్ల‌తో త‌న్నిన త‌న్నుకు ఆ మూత ఓపెన్ కావ‌డం.. ఆ వీడియో అప్‌లోడ్ చేయ‌డం, ఇప్పుడు ఇదీ ట్రెండ్‌. వీడియోలో చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ, ఆ వీడియో అంత ప‌ర్ఫెక్ట్ గా రావ‌డానికి ఎన్ని బాటిళ్ల నీళ్లు వృథా పోతాయో ఎవ‌రైనా ఆలోచించారా? స‌ల్లూభాయ్ ఆలోచించారు.

బాలీవుడ్ స‌ల్మాన్‌ఖాన్ ఈ వీడియో కొత్త‌గా చేశారు. చాలెంజ్‌లో పాల్గొన్న‌ప్ప‌టికీ చుక్క నీరు వృథా కాకుండా బాటిల్ మూత‌ను ఓపెన్ చేశారు. ఇంత‌కీ స‌ల్మాన్ ఎలా ఓపెన్ చేశారు? నోటి నిండా గాలి తీసుకుని బాగా ఊది, మూత‌ను తెరిచారు. నీళ్లు తాగారు. `సేవ్ వాట‌ర్‌` అని నీటి విలువ‌ను కూడా చెప్ప‌క‌నే చెప్పారు. అద‌న్న‌మాట సంగ‌తి. ట్రెండ్‌లో ఉన్న‌ట్టుండాలి.. ట్రెండ్‌ను సృష్టించేట‌ట్టు ఉండాలి. ద‌బాంగ్ హీరోనా.. మ‌జాకా మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.