కమల్ - రెహమాన్ చేతులు కలిపారోచ్!
Send us your feedback to audioarticles@vaarta.com
కమల్‌హాసన్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కమల్ దర్శకత్వంలో మెడ్రాస్ మొజార్ట్ రెహమాన్ సంగీతం వహిస్తున్న తొలి చిత్రమిదే. నిన్న రాత్రి కమల్‌తో కలిసి రెహమాన్ తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దాంతో ఈ కొత్త సినిమా గురించి వార్తలు మొదలయ్యాయి. అయితే తాజా చిత్రం గురించి వారిద్దరూ ఏమీ స్పందించలేదు. కానీ ఈ సినిమా `కేన్ అమర్ హై` (తలైవన్ ఇరుక్కిరాన్ అనే తమిళ ప్రాజెక్ట్) అని ఇప్పటికే ప్రచారం మొదలైంది. 2015లోనే కమల్‌హాసన్ ఈ ప్రాజెక్ట్ గురించి వివరించారు. సైఫ్ అలీ ఖాన్ హీరోగా, కమల్ విలన్‌గా నటించాలనుకుని నిర్ణయించుకున్న చిత్రమది. కమల్ హాసన్ సొంత సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్‌తో పాటు లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.